Begin typing your search above and press return to search.
ఉస్తాద్ తో జట్టుకట్టనున్న జాతిరత్నం..?
By: Tupaki Desk | 3 Nov 2022 2:30 AM GMTఅనుదీప్ కేవీ.. నేటి తరం సినీ అభిమానులకు ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'పిట్టగోడ' సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన అతను.. 'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తనదైన క్రింజ్ కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాడు.
అనుదీప్ సినిమాలతో పాటుగా అతని రియల్ లైఫ్ యాటిట్యూడ్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా వేదికలపై ఇంటర్వ్యూలలో దర్శకుడి మాట తీరు.. వ్యవహార శైలి.. సెన్సాఫ్ హ్యూమర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
విజయ్ దేవరకొండ లాంటి హీరో తనకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో అనుదీప్ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తుంటానని చెప్పాడంటేనే అతని కామెడీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అన్ని సినిమాల్లో ఒకే తరహా కామెడీ చూపిస్తే ఆడియన్స్ సైతం బోర్ గా ఫీల్ అవుతారు కాబట్టి.. అనుదీప్ మూడో చిత్రానికి ఆశించిన ఫలితం దక్కలేదు.
అనుదీప్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ''ప్రిన్స్''. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్.. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. తమిళ్ లో అంతో ఇంతో వసూళ్ళు రాబట్టినా.. తెలుగులో మాత్రం ఏ దశలోనూ నిలబడలేకపోయింది.
'ప్రిన్స్' పెద్దగా ఆడకపోయినా డైరెక్టర్ అనుదీప్ కేవీ కి అవకాశాలు తగ్గలేదు. ఇప్పటికే టాలీవుడ్ లోని మూడు అగ్ర నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాయి. నిజానికి యువ దర్శకుడు ఇప్పటి వరకూ చేసిన మూడు సినిమాలు కూడా పెద్ద బ్యానర్స్ లో చేసినవే.
అనుదీప్ ఫస్ట్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తే.. రెండో చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో చేసాడు. థర్డ్ ప్రాజెక్ట్ ని సునీల్ నారంగ్ - సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాతలు సంయుక్తంగా నిర్మించారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు స్వప్న సినిమాస్ కోసం సినిమాలు చేయడానికి అడ్వాన్సులు తీసుకున్నాడు.
అయితే అనుదీప్ ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కి సరిపడే ఓ కథ రాస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని.. రామ్ సైతం డైరెక్టర్ తో వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కాస్త సమయం పట్టొచ్చు.
రామ్ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్ లో అనుదీప్ మరో సినిమా చేసి రావొచ్చు.
ఇప్పటికే అనుదీప్ వద్ద కొన్ని కథలు ఉన్నాయి. ఎలాగూ నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి.. ఏ హీరో ఓకే అంటే ఆ హీరోతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని షురూ చేస్తాడు. అయితే ఈసారి మాత్రం దర్శకుడు సరికొత్త కథతో ఇప్పటి వరకూ చేసిన మూడు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే మూవీ చేయాలని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.