Begin typing your search above and press return to search.

తిమింగళం పక్కనే ఈత కొట్టిన సెక్సిణీ

By:  Tupaki Desk   |   1 Aug 2016 12:10 PM GMT
తిమింగళం పక్కనే ఈత కొట్టిన సెక్సిణీ
X
బాలీవుడ్ భామల పని బాగుంటుందిలే. ఎంత బిజీ భామలైనా కూడా.. మనోళ్ళు ఒక సినిమా రిలీజ్ పనులు పూర్తయ్యాయంటే.. వెంటనే ఎక్కడికైనా హాలిడేకు చెక్కేస్తారు. అదిగో శ్రీలంకన్ బ్యూటి జాక్వెలైన్ కూడా అంతే. మొన్నటివరకు నార్త్ ఇండియా అంతా తిరుగుతూ.. ''డిష్యూం'' సినిమాను తెగ ప్రమోట్ చేసింది. గత శుక్రవారం సినిమా రిలీజైందో లేదో.. వెంటనే రిలాక్స్ అవ్వడానికి మాల్డీవులు చెక్కేసింది.

ఇప్పుడు జాకీ తన తల్లితో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడి సముద్రంలో డీప్‌ సీ డైవింగ్ బాగా ఫేమస్. అందుకే అమ్మడు వెంటనే బికినీలోకి దూకేసి.. ఆక్సిజన్ మాస్క్ పెట్టేసుకుని.. అండర్ వాటర్ లోకి వెళ్లిపోయింది. అంతే కాదు.. అక్కడొక తిమింగళపు జాతికి చెందిన షార్కు సరసన అమ్మడు పోటీగా ఈత కొట్టేసింది కూడా. ఆ జయింట్ నీటిజీవి సరసన ఈత కొడుతుంటే.. ఆ థ్రిల్లే వేరు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇలా తిమింగళంతో పక్క నుంచి స్విమ్‌ చేసుకుంటూ వెళ్లడం చాలా సంతోషంగా ఉందని.. కాని అనవసరంగా సముద్రాలను కలుషితం చేస్తూ నీటి ప్రాణులకి హింస కలిగించొద్దంటూ అమ్మడు పేర్కొంది.

సినిమా విషయానికొస్తే.. జాకీ చేతిలో ఇంకా చాలా బాలీవుడ్‌ సినిమాలున్నాయి. ''డిష్యూం'' సినిమా రిజల్టు మిక్సడ్ గా ఉన్నా కూడా.. అమ్మడికి పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అందానికి అందం.. రేటులో డిస్కౌంట్లు.. ఇవే అమ్మడు సీక్రెట్లు.