Begin typing your search above and press return to search.
జవాన్ ఫిక్స్ అయ్యాడు!
By: Tupaki Desk | 6 May 2023 9:14 PM GMTపఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన మొదటి హిందీ మూవీగా ఇది నిలిచింది. ఇప్పుడు అత్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. జవాన్ సినిమాపై హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషలలో కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హిందీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని అత్లీ భావిస్తున్నారు. ఇక మూవీలో షారుఖ్ ఖాన్ ఇండియన్ ఆర్మీ జవాన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషలలో జవాన్ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఈ పోస్టర్ తో మారువేషంలో ఉన్న షారుఖ్ ఖాన్ యాక్షన్ స్టిల్ ని ఎలివేట్ చేశారు.
ఈ లుక్ బట్టి సినిమాని అత్లీ చాలా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక షారుఖ్ ఖాన్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండటం విశేషం. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. రావన్ లాంటి డిజాస్టర్ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా తన ప్రొడక్షన్ లో చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. దీంతో పాటు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ అనే మూవీలో కూడా షారుఖ్ ఖాన్ నటిస్తున్నారు.
ఈ మూవీలో తాప్సీ షారుఖ్ ఖాన్ కి లీడ్ గా నటిస్తోంది. ఈ మూవీపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారుఖ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న జవాన్ ఏ స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.