Begin typing your search above and press return to search.
జవాన్ టీంకు ధైర్యమొచ్చింది
By: Tupaki Desk | 27 Nov 2017 11:34 AM GMTసాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘జవాన్’ మొదలైనప్పటి నుంచి దాని మీద ఏమంత పాజిటివ్ బజ్ లేదు. దీనికి ముందు తేజు నటించిన మూడు సినిమాలూ డిజాస్టర్లవ్వగా.. దీని దర్శకుడు బి.వి.ఎస్.రవి తొలి సినిమా ‘వాంటెడ్’ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీనికి తోడు ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడం.. వాయిదాల మీద వాయిదాలు పడటంతో దీని చుట్టూ నెగెటివిటీ పెరిగిపోయింది. కొన్ని రోజుల ముందు వరకు దీనిపై పెద్దగా హైప్ లేదు. ఐతే నాలుగు రోజుల కిందట ట్రైలర్ రిలీజయ్యాక సీన్ మారింది. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం.. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో నెగెటివిటీ తగ్గింది.
ఇదే సమయంలో ప్రచార జోరు కూడా పెరగడం.. చిన్న సినిమాల మోతలో కొంచెం పెద్ద స్థాయి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న టైంలో ఇది విడుదలకు సిద్ధమవుతుండటంతో దీనికి నెమ్మదిగా హైప్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘జవాన్’ టీంలో కొంచెం ధైర్యం వచ్చినట్లుంది. ఈ సినిమాపై ధీమాగా ఉన్న చిత్ర బృందం.. విడుదలకు ముందు రోజే ప్రివ్యూలు వేయడానికి రెడీ అయిపోయింది. శుక్రవారం రిలీజ్ అయితే.. గురువారం రాత్రే సెలబ్రెటీలు.. మీడియా వాళ్లు.. అభిమానులకు స్పెషల్ షోలు వేయబోతున్నారు. హైదరాబాద్ లో రెండు మూడు థియేటర్లలో షోలు ఉంటాయట. ఇలా ముందు రోజు షో వేయాలంటే సినిమా మీద చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి. సినిమా బాలేకుంటే బ్యాడ్ టాక్ బయటికి వచ్చి ఓఫెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఐతే ఈ చిత్రానికి అన్నీ తానై వ్యవహరిస్తున్న దిల్ రాజు.. ధీమాగా ప్రివ్యూలకు ఓకే చెప్పాడంటే సినిమాపై భరోసాతో ఉన్నట్లే.