Begin typing your search above and press return to search.
అట్లీ కోసం 'జవాన్' గా మారిన షారుఖ్.. ఆసక్తికరంగా టైటిల్ టీజర్..!
By: Tupaki Desk | 3 Jun 2022 10:30 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. 2018లో 'జీరో' ప్లాప్ అయిన తర్వాత స్టార్ హీరో మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఇప్పుడు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. అందులో కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ తో చేస్తున్న సినిమా కూడా ఉంది.
షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు 'లయన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో టైటిల్ ను ఖరారు చేసిన మేకర్స్.. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు.
అట్లీ - షారుక్ కాంబోలో రూపొందే సినిమాకు ''జవాన్'' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా ఒకటిన్నర నిమిషాల టీజర్ ను ఆవిష్కరించారు. ఇందులో షారుక్ ఇంతకుముందెన్నడు చూడని సరికొత్త గెటప్ లో కనిపించారు. గాయాలపాలైన ముఖానికి చేతులకు కట్లు కట్టుకుని మాస్ లుక్ తో ఆకట్టుకున్నారు.
టీజర్ చివర్లో షారుక్ రెండు వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించడంతో 'జవాన్' సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేదా అతని పాత్రలో రెండు వెరీయేషన్స్ ఉంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మొత్తం మీద బాలీవుడ్ హీరోని అట్లీ సరికొత్త అవతార్ లో పరిచయం చేస్తున్నట్లు ఈ టీజర్ ను బట్టి అర్థం అవుతుంది. ఇది సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తోంది.
''జవాన్'' చిత్రాన్ని 2023 జూన్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుక్ సతీమణి గౌరీఖాన్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు.
ఇకపోతే 'జవాన్' సినిమాలో నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నారని సమాచారం. ఇది నయన్ కు హిందీ డెబ్యూ మూవీ. ఇందులో సాన్యా మల్హోత్రా మరో కీలక పాత్రలో కనిపించనుంది. అనేక మంది సౌత్ దర్శకులు నార్త్ లోనూ సత్తా చాటారు. ఈ క్రమంలో అట్లీ తన బాలీవుడ్ డెబ్యూ మూవీతో ఎలాంటి క్రేజ్ అందుకుంటారో చూడాలి.
ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్' అనే సినిమా చేస్తున్నారు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 25న విడుదల కాబోతోంది. ఇక రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఇటీవలే 'డంకీ' అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.