Begin typing your search above and press return to search.

పది రోజుల్లో భలే చక్కబెట్టేశాడు

By:  Tupaki Desk   |   21 Aug 2017 5:09 PM GMT
పది రోజుల్లో భలే చక్కబెట్టేశాడు
X
ఇప్పుడు ఆడుతున్న సినిమాల్లో నేను రాజు నేనే మంత్రి మరియు జయ జానకి నాయక సినిమాలు మాస్ కు బాగా నచ్చేశాయి. దానితో ఈ సినిమాలు బాక్సీఫీస్ దగ్గర నువ్వానేనా అన్నంతలా పోటీపడుతున్నాయి. ఈ శుక్రవారం వచ్చే వరకు అసలు రిలీజ్ కు సినిమాలేవీ లేవు కాబట్టి.. ఇప్పుడు ఈ సినిమాలకు మాంచి టైమ్ దొరికినట్లే. చక్కగా బాక్సాఫీస్ దగ్గర దండుకోవచ్చు.

అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ రెండు సినిమాల తాలూకు కలక్షన్లు చూస్తే.. 10 రోజుల్లో బాగానే ఇంప్రెస్ చేశాయి. రెండో వీకెండ్ కూడా పూర్తయ్యే నాటికి నేనే రాజు నేనే మంత్రి సినిమా తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 17+ కోట్ల షేర్ వసూలు చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా అన్నీ కలుపుకుని 21+ కోట్లు షేర్ వసూలు చేసింది. అయితే లేటుగా స్టార్టయిన ఊపు మాత్రం జయ జానకి నాయక సినిమాకు బాగానే ఉపయోగపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ బోయపాటి మూవీకి కూడా 17+ కోట్లు షేర్ వస్తే.. ఓవర్సీస్ మరియు ఇతర లొకేషన్లతో కలుపుకుని ఏకంగా 18.5+ కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే ఖచ్చితంగా మాస్ పల్స్ రేంజేంటో చూపిస్తో బోయపాటి ఓ రేంజులో కలక్షన్లను తెచ్చేసినట్లు.

కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. బోయపాటి శ్రీను ఒకవేళ జయ జానకి నాయక సినిమాకు అందరూ అనుకుంటున్నట్లు 45+ కోట్లు బడ్జెట్ పెట్టుంటే మాత్రం.. రికవరీ చాలా కష్టమనే చెప్పాలి. అసలు ఈరోజుల్లో పెద్ద పెద్ద స్టార్లు లేకుండా 40 కోట్లు పైన షేర్ వసూలు చేయాలంటే చాలా కష్టమే అవుతోంది. అప్పుడప్పుడు శతమానంభవతి.. ఫిదా వంటి వండర్లు జరుగుతాయి కాని.. అస్తమానం అలాంటివి జరగవు.