Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'జయ జానకి నాయక'
By: Tupaki Desk | 12 Aug 2017 5:38 AM GMTచిత్రం : ‘జయ జానకి నాయక’
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ - రకుల్ ప్రీత్ - జగపతిబాబు - శరత్ కుమార్ - తరుణ్ అరోరా - ప్రగ్యా జైశ్వాల్ - వాణీ విశ్వనాథ్ - సితార - నందు - శ్రవణ్ - జయప్రకాష్ - ధన్య బాలకృష్ణన్ - శివన్నారాయణ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బోయపాటి శ్రీను
స్టార్ హీరోలతో మాస్ మసాలా సినిమాలు చేసే బోయపాటి శ్రీను.. బెల్లకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో సినిమా తీయడానికి సిద్ధమవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. పైగా ఈ సినిమాకు సంబంధించి మొదట్లో వచ్చిన ప్రోమోలు ‘క్లాస్’గా ఉండి ప్రేక్షకుల్ని మరింతగా ఆశ్చర్యానికి గురి చేశాయి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ ను పెట్టి బోయపాటి అసలెలాంటి సినిమా తీశాడు.. అందులో బోయపాటి మార్కు మాస్ వినోదం ఉందా లేదా.. మొత్తంగా ఈ సినిమా విశేషాలేంటి.. చూద్దాం పదండి.
కథ:
గగన్ (సాయిశ్రీనివాస్) ఒక పెద్ద ఇండస్టియలిస్ట్ కొడుకు. కానీ ఇంట్లో ఆడవాళ్లెవ్వరూ లేకపోవడం వల్ల గగన్ తో పాటు అతడి తండ్రి.. అన్నయ్య కొంచెం కఠువుగా.. దారి తప్పి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయంలో గగన్ చదివే కాలేజీలో అతణ్ని చూసి ఇంప్రెస్ అయిన స్వీటీ (రకుల్ ప్రీత్).. గగన్ ఇంటికీ వచ్చి ఆ కుటుంబం మొత్తాన్ని మారుస్తుంది. దీంతో గగన్ తో పాటు అతడి కుటుంబం కూడా ఆమెకు ఫిదా అయిపోతుంది. స్వీటీ కూడా గగన్ ను ప్రేమిస్తుంది. కానీ వీళ్ల ప్రేమకు స్వీటీ తండ్రి అడ్డం పడతాడు. విధి లేని పరిస్థితుల్లో తన ప్రేమను గగన్ త్యాగం చేస్తాడు. కానీ తర్వాత స్వీటీ చాలా పెద్ద కష్టాల్లో ఉందని.. ఆమె జీవితానికి ప్రమాదమని తెలుస్తుంది గగన్ కు. ఇంతకీ గగన్ కు దూరమయ్యాక స్వీటీకి ఏమైంది.. ఈ జీవితానికి వచ్చిన ముప్పు ఏంటి.. గగన్ ఆమెను ఎవరి నుంచి ఎలా కాపాడుకున్నాడు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
రాజమౌళి రొటీన్ సినిమాల నుంచే వచ్చినా.. సినిమా సినిమాకు ఎదుగుతూ వెళ్లాడు. కొత్త విషయాలు నేర్చుకుంటూ.. వాటిని తన సినిమాలకు అన్వయిస్తూ వేరే దర్శకులెవరూ అందుకోలేని స్థాయికి చేరిపోయాడు. ఇక సుకుమార్ లాంటి దర్శకులు ప్రతిసారీ కొత్తగా ఏదో ప్రయత్నిస్తుంటారు. సినిమాకు.. సినిమాకు సంబంధం లేకుండా చూసుకుంటారు. వాళ్ల శైలే కొత్తగా ఉంటుంది. ఇక టాలీవుడ్లో బోయపాటి లాంటి దర్శకులది మరో శైలి. అతడికి మాస్ మసాలా సినిమాలు వండటం.. ఆ వర్గం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడం బాగా తెలుసు. ఈ విద్యలో ఆరితేరిపోయిన బోయపాటి.. తన మార్కు సినిమా కోసం వచ్చే ప్రేక్షకుడిని నిరాశ పరచడు. కొత్తగా ఆలోచించలేడో.. ఆ ప్రయత్నం చేయడో కానీ.. ఒక తరహా కథల్ని పట్టుకుని వేలాడుతుంటాడు. హీరో ఎవరైనా.. అతడి ఇమేజ్ ఎలాంటిదైనా తనదైన శైలి సినిమానే తీస్తాడు. తన నుంచి ఏం ఆశిస్తారో అది ఇస్తాడు. ‘జయ జానకి నాయక’ కూడా ఆ కోవలోని సినిమానే.
బెల్లకొండ శ్రీనివాస్ హీరో కదా.. ఇందులో బోయపాటి మార్కు ఓవర్ ద టాప్ హీరోయిజం.. యాక్షన్ సన్నివేశాలు.. ఎమోషన్స్ చూపించడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది అని సందేహాలేం పెట్టుకోవాల్సిన పని లేదు. పెద్ద హీరోగా ఎదిగినప్పటికీ కొంచెం క్లాస్ టచ్ తో ఉన్న సినిమాలే చేస్తూ వచ్చిన అల్లు అర్జున్ ను ఎలా ఊర మాస్ అవతారంలో చూపించాడో... అసలు ఇమేజ్ అంటూ ఏమీ లేని శ్రీనివాస్ ను సైతం అదే స్థాయి మాస్ పాత్రలో చూపించడానికి ప్రయత్నించాడు బోయపాటి. ఇది సగటు ప్రేక్షకుడికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించకమానదు. కానీ మాస్ ప్రేక్షకులు మాత్రం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. శ్రీనివాస్ కదా అని హీరోయిజంలో కానీ.. యాక్షన్ విషయంలో కానీ.. భారీతనంలో కానీ రాజీ పడలేదు. తన పరిమితుల్లోనే ఒక రొటీన్ కథను భారీతనంతో చెప్పాడు. బోయపాటి నుంచి కొత్తదనం కోరుకున్నా.. అంతంత భారీ ఫైట్లా.. ఇంత వయొలెన్సా.. ఎప్పుడూ ఇవే కథలా అని ఫిర్యాదులు చేసేట్లున్నా ‘జయ జానకి..’ జోలికి వెళ్లకపోవడం మంచిది.
తన సినిమాలో ఫైట్లు ఊరికే వచ్చి పడిపోవని.. ప్రేక్షకుడు కొట్టమన్నపుడే హీరో కొడుతుంటాడని బోయపాటి అంటుంటే కొంచెం కామెడీగా అనిపించొచ్చు వాస్తవానికి అతను చెప్పింది నిజమే. ప్రేక్షకుడు హీరోచిత విన్యాసాల కోసం ఎదురు చూసేలా ముందు సెటప్ క్రియేట్ చేయడం.. ఆ తర్వాత హీరోను రంగంలోకి దించి అతడు చెలరేగిపోయేలా చేయడం బోయపాటి శైలి. ‘జయ జానకి నాయక’లోనూ అదే చేశాడు. ఇందులో విలన్లను తీరు.. వాళ్ల బలం.. వాళ్ల క్రూరత్వం చూస్తే.. ‘లెజెండ్’లో.. ‘సరైనోడు’లో ఎలాగైతే.. ఒక రక్షకుడిని కోరుకుంటారో అలాంటి భావనే కలుగుతుంది ఇక్కడ కూడా. బెల్లంకొండ శ్రీనివాస్ ఏంటో.. అంతేసి విలన్లను ఢీకొట్టడమేంటి అనిపించకుండా మొదట్లోనే అతడి పాత్రను.. అతడి బలాన్ని ఎస్టాబ్లిష్ చేసి.. యుద్ధానికి అతణ్ని సిద్ధం చేస్తాడు. శ్రీనివాస్ ఇమేజ్.. అతడి హావభావాలు.. డైలాగ్ డెలివరీ సంగతెలా ఉన్నా.. బోయపాటి మార్కు హీరోయిజం చూపించడానికి తగ్గ అవతారంలోకి మాత్రం మారాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్లో అయినా.. హంసల దీవిలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లో అయినా.. క్లైమాక్స్ ఫైట్లో అయినా.. ఓవర్ ద టాప్ హీరోయిజం మాస్ ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఈ సన్నివేశాలు సగటు ప్రేక్షకుడికి మాత్రం అతిగా అనిపిస్తాయి.
యాక్షన్ కు మాత్రమే కాదు.. ఎమోషన్లకు కూడా తన కథలో చోటుండేలా చూసుకున్నాడు బోయపాటి. సినిమాలో హీరో కంటే కూడా హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. హీరోయిన్ పాత్ర చుట్టూ కథను నడపడం వల్ల ఈ కథకు బలం వచ్చింది. పరువు కోసం ప్రాణాలు తీసేసే జగపతిబాబు.. అతణ్ని వ్యాపారంలో ఢీకొట్టే తరుణ్ అరోరాల మధ్య తనకు సంబంధం లేకుండా వచ్చి నలిగిపోయేలా రకుల్ పాత్రను సెట్ చేసిన తీరు ఆసక్తి రేకెత్తిస్తుంది. సినిమాలో కొత్తగా అనిపించేది ఈ నేపథ్యమే. కథలోనే కాక సినిమా అంతటా భారీతనం కనిపించడం వల్ల ఒక చిన్న స్థాయి కథానాయకుడి సినిమా చూస్తున్న భావన కలగదు. ముందే అన్నట్లు ఇది వంద శాతం బోయపాటి మార్కు సినిమా. ఏం కోరి తన సినిమాకు వస్తారో అది అందిస్తాడు బోయపాటి. కానీ అతడి కథలు రొటీన్ అయిపోతుండటం మాత్రం పెద్ద ప్రతికూలత. తొలి సినిమా ‘భద్ర’లో.. చివరగా తీసిన ‘సరైనోడు’లో ప్రధాన పాత్రల్ని ఎలా చూశామో.. ఇందులోనూ అలాగే ఉంటాయి. మళ్లీ బోయపాటి పాత సినిమాల్నే చూసిన భావన కలిగిస్తుంది ‘జయ జానకి నాయక’. ప్రథమార్ధంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వరకు పెద్దగా కథేమీ ఉండదు. సన్నివేశాలు సాదాసీదాగా ఒక ఫార్మాట్లో సాగుతాయి. టూమచ్ హీరోయిజం.. వయొలెన్స్ ఇబ్బందిపెడతాయి. కామెడీ లేకపోవడం కూడా ప్రతికూలతే.
నటీనటులు:
బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాలతో పోలిస్తే బాగా మెరుగయ్యాడు. బోయపాటి మార్కు హీరోగా బాగానే ఒదిగిపోయాడు. అతడి కష్టం తెరమీద కనిపిస్తుంది. లుక్ పరంగా అతను ఆకట్టుకుంటాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగానే చేశాడు. కానీ చాలా చోట్ల అతడి ముఖంలో భావాలు పలకలేదు. మెరుగైనట్లు అనిపిస్తూనే ఇంకా నటన విషయంలో బలహీనంగానే కనిపిస్తాడు శ్రీనివాస్. పతాక సన్నివేశంలో అతడి కాన్ఫిడెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. పెద్ద నటీనటుల మధ్య కాన్ఫిడెంట్ గానే నటించే ప్రయత్నం చేశాడు. రకుల్ ప్రీత్ కు మరో గుర్తుంచుకోదగ్గ పాత్ర దక్కింది. బహుశా తన కెరీర్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. వేరియేషన్స్ ఉన్న పాత్రను రకుల్ బాగా చేసింది. తన నుంచి ప్రధానంగా గ్లామర్ ఆశిస్తే కష్టమే. ఆ విషయంలో ప్రగ్యా జైశ్వాల్.. కేథరిన్ సంతృప్తి పరుస్తారు. ‘లెజెండ్’తో జగపతిబాబు కెరీర్ ను మలుపు తిప్పిన బోయపాటి.. ఇందులోనూ ఆయనకు మంచి పాత్ర ఇచ్చాడు. జగపతి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన పాత్రతో పాటు గెటప్.. నటన ఆకట్టుకుంటాయి. విలన్ తరుణ్ అరోరా కూడా మెప్పించాడు. శరత్ కుమార్ బాగా చేశాడు. తన పాత్రకు బలం తెచ్చాడు. వాణీ విశ్వనాథ్ గురించి బోయపాటి ఓ రేంజిలో చెప్పాడు కానీ.. ఆమె పాత్రలో ఏ విశేషం లేదు. జయప్రకాష్.. సితార.. నందు.. వీళ్లంతా ఓకే.
సాంకేతికవర్గం:
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు తగ్గట్లే ఉంది. ఒక మాస్ మసాలా సినిమాకు ఎప్పుడూ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అలాంటి సంగతమే అందించాడు దేవి. అతడి పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ‘నువ్వేలే నువ్వేలే..’.. ‘‘వీడే వీడే..’ పాటలు వినసొంపుగా అనిపిస్తాయి. మిగతా పాటలన్నీ మామూలే. నేపథ్య సంగీతంతో సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో దేవిశ్రీ తన వంతుగా కృషి చేశాడు. రిషి పంజాబి ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. హంసల దీవి ఎపిసోడ్లో ఆయన పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. హీరో స్థాయి చూసుకోకుండా భారీగా ఖర్చు చేశారు. రత్నం మాటలు ఓకే. ఇక బోయపాటి విషయానికొస్తే.. ప్రోమోలు చూసి ఈసారి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాడని.. మారిపోయాడని.. అనుకుంటే నిరాశే. అతను తాను గీసుకున్న హద్దుల్లోంచి ఈసారి కూడా బయటికి రాలేదు. కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. తన శైలిలో.. తన పరిమితులకు లోబడే సినిమా తీశాడు. ఐతే బెల్లంకొండ శ్రీనివాస్ అని రాజీ పడకుండా భారీ కథను ఎంచుకోవడం.. దాన్ని అంతే భారీగా తెరకెక్కించడంలో బోయపాటి తన సిన్సియారిటీ చూపించాడు. రొటీనే అనిపించినా మల్టిపుల్ లేయర్స్ ఉన్న.. భారీతనం ఉన్న కథతో మెప్పించాడు.
చివరగా: జయ జానకి నాయక.. బోయపాటి మార్కు మాస్ వినోదం
రేటింగ్- 3/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre