Begin typing your search above and press return to search.

టీజర్ టాక్‌: బోయపాటి మార్లేదండోయ్

By:  Tupaki Desk   |   21 July 2017 4:14 AM GMT
టీజర్ టాక్‌: బోయపాటి మార్లేదండోయ్
X
అమ్మో మా బోయపాటి మారిపోయాడు. అమ్మో బాగా చేంజ్ అయిపోయాడు. తనకు అచ్చొచ్చిన యాక్షన్ ను వదిలేసి ఇప్పుడు పూర్తి స్థాయి లవ్ స్టోరీలవైపు వెళ్ళిపోయాడు. రొమాన్స్ పైనే ఫోకస్ పెట్టాడు... ఇలా బాధపడుతున్న వారందరూ ఇక కళ్ళను కర్చీఫ్‌ తో తుడుచుకుని ఇప్పుడు బోయపాటి ఇచ్చిన కొత్త టీజర్ చూడండి. క్లారిటీ కత్తిలా వస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా.. 'జయ జానకి నాయక' సినిమాతో దూసుకొస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాలో పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ స్టోరీ మాత్రమే ఉందనుకునేవారికి క్లారిటీ ఇస్తూ ఇప్పుడు కొత్త టీజర్లో కావల్సినంత యాక్షన్ చూపించేశాడు. ''లైఫ్‌ లో కష్టం వచ్చిన ప్రతీసారీ లైఫ్ ను వదులుకోం.. ప్రేమను వదిలేసుకుంటాం.. నేను వదలను.. ఎందుకంటే నేను ప్రేమించా'' అంటూ మాస్ పంచ్ ఉన్న డైలాగ్ కూడా చెప్పించేశాడు. కాకపోతే ఇది లవ్ స్టోరీయే కాని.. ఒక యాక్షన్ లవ్ స్టోరీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు బోయపాటి. కాకపోతే చాలా షాట్లు సరైనోడు సినిమాను తలపించినట్లు ఈ టీజర్ చూసినా కూడా అనిపిస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 11న ఇండిపెండెన్స్ డే వీకెండ్ క్యాష్‌ చేసుకోవడానికి ధియేటర్లలోకి దించుతున్నాడు బోయపాటి. జగపతి విలనీ.. రకుల్ గ్లామర్ సినిమాకు పెద్ద ప్లస్సయ్యే ఛాన్సుంది.