Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కు మరో కాంతార లాంటి కంటెంట్ మూవీ రానుందా?
By: Tupaki Desk | 20 Nov 2022 4:21 AM GMTకరోనా కీడు మాత్రమే కాదు మేళ్లు ఎన్నో చేసింది. అందులో ఒకటి.. అప్పటికే ఉన్న ఓటీటీలను వాడేయటం ఎలా అన్న విషయాన్ని ఎంచక్కా నేర్పించేసింది. పొద్దున్నే లేచింది మొదలు రాత్రిళ్లు నిద్రపోయే వరకు మరే వ్యాపకం లేకపోవటంతో ఓటీటీ ప్లాట్ ఫాంలో ఆ భాష.. ఈ భాష అన్న తేడా లేకుండా సినిమాల్ని చూసేయటం ద్వారా.. మనం ఇంతకాలం ఎన్నేసి మంచి సినిమాలు మిస్ అయ్యామన్న విషయం అర్థమైంది. అలా మొదలైన వెతుకులాట.. కరోనా పోయిన తర్వాత.. కంటెంట్ ఉన్న సినిమాలు వెండితెరను అలరించినా.. అది డబ్బింగ్ సినిమానా? రీమేక్ మూవీనా అన్న విషయాన్ని పట్టించుకోకుండా సినిమాను చూసి ఎంజాయ్ చేసే మైండ్ సెట్ వచ్చేసింది.
దీనికి తగ్గట్లే కశ్మీర్ ఫైల్స్.. కార్తికేయ 2.. సీతారామం.. కాంతార మూవీలు రావటమే కాదు.. పలు భాషల్లో దుమ్ము లేపేశాయి. దీంతో కంటెంట్ ఉన్న సినిమాల్ని వెనుకా ముందు చూడకుండా డబ్బింగ్ చేయొచన్న మాట వినిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడో మలయాళం మూవీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జయ జయ జయ జయహే పేరుతో విడుదలైన ఈ మూవీ కేరళ రాష్ట్రంలో బారీ హిట్ కొట్టేయటమే కాదు.. భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. అంకెల్లో చెప్పాలంటే.. కేవలం రూ.6 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఒక్క మలయాళంలోనే ఈ సినిమా రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో.. సినిమా మీద పెట్టిన పెట్టుబడికి పది రెట్లు ఎక్కువ సంపాదించిన ఈ మూవీని ఇతర భాషల్లోనూ విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
అక్టోబరు చివరి వారంలో విడుదలైన ఈ మూవీ ఇప్పటికి విజయవంతంగా రన్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీలో కథేంటి? అన్న విసయానికి వస్తే.. స్వతంత్ర భావాలున్న అమ్మాయి.. తన పెళ్లి సందర్భంగా అబ్బాయితో కాస్తంత మాట్లాడాలని చెప్పి.. పెళ్లి తర్వాత చదువుతూ.. జాబ్ చేయాలన్న కలను చెబుతుంది. అందుకు ఓకే చెబుతాడు కానీ.. పెళ్లి తర్వాత నుంచి అవసరం లేకున్నా మేల్ ఇగో బయటకు రావటం.. వారి మధ్య ఇష్యులు అంతకంతకూ పెరిగిపోతాయి. విడిపోవాలని అనుకున్నా.. అందుకు ఆమె తల్లిదండ్రులు నో చెబుతారు. ఇలా వాదోపవాదాలు జరిగిన తర్వాత భర్త నుంచి విడిపోవాలని భావించటం. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలే.. ఈ సినిమాలో చూపిస్తారు.
ఏమైనా ఈ సినిమాను నేరేట్ చేసి వైనాన్ని అభినందించాల్సిందే. మరి.. తెలుగులో ఈ మూవీని విడుదల చేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అతి తక్కువ బడ్జెట్ తో విడుదలై.. కోట్లాది రూపాయిలు కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్పటికే కేరళను ఊపేయగా.. మిగిలిన భాషల్లో ఏమేం అద్భుతాలు చోటు చసుకుంటాయో చూడాలి.