Begin typing your search above and press return to search.

వర్మపై కంప్లయింట్ ఇవ్వలేదట

By:  Tupaki Desk   |   26 May 2018 8:19 AM GMT
వర్మపై కంప్లయింట్ ఇవ్వలేదట
X
రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ విడుదల తరువాత ఏ స్థాయిలో విజయం అందుకుంటుందో గాని ప్రస్తుతం క్రేజ్ అందుకోడానికి బాగానే ట్రై చేస్తోంది. సినిమాపై అయితే ప్రస్తుతం ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. వర్మ ఈ సారి పబ్లిసిటీలో ఎక్కువగా నెగిటివ్ కామెంట్ అందుకుంటున్నాడు. అది సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గాని వర్మ డైరెక్షన్ కెరీర్ పై మాత్రం మచ్చగానే మిగిలిపోతాయి అనేలా టాక్ వస్తోంది.

ఇక ఇటీవల వర్మ ఆఫీసర్ కథను దొంగిలించాడు అని అతని దగ్గర పని చేసిన జయ కుమార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు చెప్పిన కథను కాపీ కొట్టాడు అని అతనిపై చర్యలు తీసుకోడానికి సిద్ధమని గతంలో చెప్పినప్పటికీ ఆ వివాదం ఓ కొలిక్కి రాలేదు. పైగా రామ్ గోపాల్ వర్మ పై కనీసం రైటర్స్ అసోసియేషన్ లో కూడా కంప్లయింట్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని రచయితల కమిటీ తెలిపింది. సాధారణంగా కథ కాపీ అయితే వెంటనే ఆ రైటర్స్ కమిటీలో కంప్లయింట్ ఇవ్వాలి.

కానీ జయ కుమార్ ఆరోపణలు చేసి సిలైట్ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక వర్మ రివర్స్ లో తనపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పేశాడు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. ఇదివరకే వర్మ తన కథ సొంతంగా ఓకే ఇన్సిడెంట్ ఆధారంగా రాసుకున్నది అని ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదని చెప్పాడు. ఇకపోతే ఆఫీసర్ సినిమా హాలీవుడ్ సినిమా టక్కెన్ ఆధారంగా తెరకెక్కించినట్లు ఓ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.