Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : ‘జయదేవ్’
By: Tupaki Desk | 30 Jun 2017 10:08 AM GMTచిత్రం :‘జయదేవ్’
నటీనటులు: గంటా రవి - మాళవిక రాజ్ - వినోద్ కుమార్ - వెన్నెల కిషోర్ - హరితేజ - పరుచూరి వెంకటేశ్వరరావు - శివారెడ్డి - బిత్తిరి సత్తి - సుప్రీత్ - శ్రావణ్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి
కథ: అరుణ్ కుమార్
రచన: పరుచూరి బ్రదర్స్
నిర్మాత: అశోక్ కుమార్
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
గత కొన్నేళ్లలో టాలీవుడ్లోకి ఇబ్బడిముబ్బడిగా వారసులొచ్చేస్తున్నారు. సినీ రంగం నుంచే కాక వేరే ఫీల్డ్స్ నుంచి కూడా కుర్రాళ్లు హీరోలుగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ కోవలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ కూడా హీరో అవతారం ఎత్తాడు. సీనియర్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ.. రవిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘జయదేవ్’ సినిమా తీశాడు. ఇది తమిళ హిట్ మూవీ ‘సేతుపతి’కి రీమేక్. మరి అరంగేట్ర సినిమాతో గంటా రవి ఏమాత్రం మెప్పించాడు.. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉంది.. చూద్దాం పదండి.
కథ:
జయదేవ్ (గంటా రవి) సిన్సియర్ పోలీస్. అతను కొత్తగా ఒక ఊర్లోకి ఎస్సైగా వస్తాడు. ఆ ఊర్లో మస్తాన్ రాజు (వినోద్ కుమార్) అనేక అరాచకాలకు పాల్పడుతూ ఆస్తులు వెనకేస్తుంటాడు. తన అక్రమాల్ని బయటపెట్టే ప్రయత్నం చేసిన ఓ ఎస్సైని దారుణంగా హత్య చేయిస్తాడు మస్తాన్ రాజు. ఐతే ఆ ఎస్సై తన స్టేషన్ పరిధిలోనే ప్రాణాలు విడవడంతో ఈ కేసును జయదేవ్ టేకప్ చేస్తాడు. దీంతో అతడికి.. మస్తాన్ రాజుకు మధ్య వైరం మొదలవుతుంది. వీళ్లిద్దరి పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
తమిళంలో ‘సేతుపతి’ చూసిన ఎవ్వరైనా ఇది తెలుగులో ఎవరో ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా అనే అనుకుంటారు. కానీ కొత్త కుర్రాడు.. అది కూడా సినీ నేపథ్యం లేని గంటా రవితో చేయిస్తున్నారనగానే జనాల్లో రకరకాల సందేహాలు కలిగాయి. ‘జయదేవ్’ చూశాక ఆ సందేహాలే నిజమని స్పష్టమవుతుంది. ‘సేతుపతి’ రీమేక్ ను గంటా రవి అరంగేట్రం కోసం ఎంచుకుని జయంత్ అండ్ టీమ్ ఎంత పెద్ద తప్పు చేసిందో సినిమా ఆరంభమైనప్పటి నుంచి ప్రతి సన్నివేశంలోనూ అర్థమవుతూనే ఉంటుంది. ‘జయదేవ్’లో ఫెరోషియస్ పోలీస్ పాత్రకు గంటా రవి సరిపోలేదు. కథలో పెద్ద విశేషాలేమీ లేకపోయినా హీరో క్యారెక్టరైజేషన్.. హీరో పెర్ఫామెన్సే హైలైట్ గా నిలిచిన ‘సేతుపతి’ రీమేక్ ను అతను మోయలేకపోయాడు.
‘సేతుపతి’లో విజయ్ సేతుపతిని మ్యాచ్ చేయడం మన స్టార్ హీరోలకే కొంచెం సవాలుతో కూడుకున్న విషయం. అలాంటిది నటనలో అనుభవమే లేని గంటా రవి ఆ పాత్రను ఎలా పండించగలడు? నిజానికి ‘సేతుపతి’లో అంత గొప్ప కథాకథనాలేమీ ఉండవు. కానీ హీరో పాత్ర.. విజయ్ సేతుపతి నటనా ఆ సినిమాను ప్రత్యేకంగా మార్చాయి. ఐతే ‘సేతుపతి’కి ఏవైతే బలమయ్యాయో ఇక్కడ అవే పెద్ద బలహీనతలయ్యాయి. ‘సేతుపతి’కి ప్రధాన ఆకర్షణగా నిలిచిన హీరో ఎలివేషన్ సీన్లు.. ‘జయదేవ్’లో కామెడీగా అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు. మార్పులు చేర్పుల పేరుతో కథను.. హీరో పాత్రను జీవం లేకుండా తయారు చేశారు.
ఇక మాతృకతో పోలికల సంగతి పక్కన పెట్టేసి మామూలుగా చూసినా ‘జయదేవ్’ ఎక్కడా ఎంగేజింగ్ గా అనిపించదు. ఒక సిన్సియర్ పోలీస్.. అన్యాయాలు చేసే విలన్ కు అడ్డం పడతాడు. ఇద్దరి మధ్య ఎత్తులు పైఎత్తులు. చివరికి విలన్ మీద హీరో పైచేయి సాధిస్తాడు. ఇలా రొటీన్ గా సాగిపోతుంది కథ. సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపించినా.. ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టేలా మాత్రం కథనం సాగదు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాటకు టైం అయిందనుకున్నపుడల్లా హీరోయిన్ సమయం సందర్భం చూసుకోకుండా సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఒక రొమాంటిక్ సీన్.. వెంటనే ఒక పాట.. ఇలా సాగుతుంది ఈ వ్యవహారం.
హీరో గంటా రవి స్థాయికి తగ్గట్లే విలన్ పాత్ర కోసం అందరూ మరిచిపోయిన నిన్నటి తరం నటుడు వినోద్ కుమార్ ను తీసుకొచ్చారు. అతను విలనీ పేరుతో కామెడీ చేశాడు. హీరో-విలన్ మధ్య వచ్చే సన్నివేశాల్ని చూస్తే.. ‘హృదయ కాలేయం’ తరహా సెటైరికల్ కామెడీ సినిమా ఏమైనా చూస్తున్నామా అని సందేహాలు కలుగుతాయి ప్రేక్షకులకు. ఆ యాంగిల్లో చూడటం మొదలుపెడితే మాత్రం ‘జయదేవ్’ సరదాగా అనిపించొచ్చు. స్టార్ హీరోలే సామాన్యమైన పాత్రలు చేస్తూ.. బిల్డప్పులకు దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో.. ఎలాంటి ఇమేజ్ లేని గంటా రవికి ప్రతి సన్నివేశంలోనూ విపరీతమైన బిల్డప్ ఇవ్వడం.. బ్యాగ్రౌండ్ స్కోర్.. కెమెరా ఎఫెక్ట్స్ కూడా అందుకు తగ్గట్లే ఉండటం ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తుంది. మాతృకలోని ఆత్మను పట్టుకోవడంలో జయంత్ అండ్ టీమ్ పూర్తిగా విఫలమైంది. ‘సేతుపతి’ని ఎంతగా చెడగొట్టవచ్చో అంతగా చెడగొట్టింది.
నటీనటులు:
గంటా రవి నటుడిగా తొలి ప్రయత్నంలో మెప్పించలేకపోయాడు. అతను సినిమాల్లో లాంగ్ కెరీర్ కోరుకుంటే.. మార్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నటన చాలా మెరుగవ్వాలి. బాడీ లాంగ్వేజ్ కూడా మారాలి. వేరే పాత్ర ఏదైనా చేస్తే ఎలా ఉండేదో కానీ.. ‘సేతుపతి’ రీమేక్ కావడంతో విజయ్ సేతుపతితో పోల్చి చూస్తే తేలిపోయాడు. అతను హీరోగా ఎస్టాబ్లిష్ కావడం కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలి. హీరోయిన్ మాళవిక రాజ్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. విలన్ గా వినోద్ కుమార్ కూడా తేలిపోయాడు. తమిళంలో విలన్ పాత్రధారి సటిల్ పెర్ఫామెన్స్ తో బలమైన ముద్ర వేస్తే.. ఇక్కడ వినోద్ కుమార్ లౌడ్ విలనీతో పాత్రను చెడగొట్టాడు. మాంచి ఫామ్ లో ఉన్న కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఉన్నా ఏమాత్రం నవ్వించలేకపోయాడంటే సినిమాలో అతడికెలాంటి సీన్స్ పడ్డాయో అర్థం చేసుకోవచ్చు. పరుచూరి వెంకటేశ్వరావు తనకు అలవాటైన రీతిలో నటించారు. సుప్రీత్.. శ్రావణ్.. రవిప్రకాష్.. వీళ్లందరూ పెద్దగా చేసిందేమీ లేదు.
సాంకేతికవర్గం:
పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగానే సాంకేతిక నిపుణుల పనితీరు కూడా తయారైంది. ‘జెంటిల్ మన్’.. ‘అమీతుమీ’ లాంటి సినిమాలతో మళ్లీ తన ప్రత్యేకత చాటుకున్న మణిశర్మ.. ‘జయదేవ్’కు వచ్చేసరికి మెప్పించలేకపోయాడు. మొక్కుబడి పాటలు.. నేపథ్య సంగీతంతో బండి లాగించేశాడు. జవహర్ రెడ్డి ఛాయాగ్రహణం అలాగే తయారైంది. నిర్మాణ విలువలు అంతంతమాత్రమే. చాలా చోట్ల రాజీ పడ్డ సంగతి స్పష్టంగా కనిపిస్తుంది. రచయితలు పరుచూరి బ్రదర్స్ ఫామ్ లో లేరనడానికి ‘జయదేవ్’ తాజా రుజువు. మూల కథకు వాళ్లు చేసిన మార్పులేమీ పని చేయలేదు. మాటల్లోనూ ఏ ప్రత్యేకతా లేకపోయింది. దర్శకుడిగా జయంత్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. కానీ ఆయన కెరీర్లో ‘జయదేవ్’ లాంటి సినిమా మాత్రం ఎప్పుడూ తీయలేదు. జయంత్ చివరగా తీసిన సినిమా ‘తీన్ మార్’ కూడా రీమేకే. ఐతే ఆ సినిమా ఆడకపోయినా అందులో ఆయన దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. కానీ ‘జయదేవ్’ మాత్రం ఆయన పేరును బాగా దెబ్బ తీసే సినిమా. ‘తీన్ మార్’ తర్వాత వచ్చిన విరామంలో జయంత్ ఎంతగా ఔట్ డేట్ అయిపోయాడో అనిపిస్తుంది ‘జయదేవ్’ చూస్తుంటే.
చివరగా: జయదేవ్.. చుక్కలు చూపిస్తాడు!
రేటింగ్: 1.25/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre