Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: ది ఐరన్ లేడీ గా పురట్చితలైవి
By: Tupaki Desk | 20 Sept 2018 10:08 PM ISTబయోపిక్ ల వైరల్ ఫీవర్ టాలీవుడ్ కే కాదు కొలీవుడ్ కూ గట్టిగా అంటుకుంది. తమిళరాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసి తమిళ ప్రజలచేత 'అమ్మ' అని పిలిపించుకున్న జె. జయలలిత పోయినేడాది తనువు చాలించిన సంగతి తెలిసిందే. అమ్మ మరణం తర్వాత తమిళ నాట ఒక శకం ముగిసింది. ఇక రాజకీయాల సంగతి పక్కనబెడితే జయ జీవితం ఆధారంగా ఐదు బయోపిక్ లు ప్రకటించారు.
భారతీరాజా.. ప్రియదర్శిని.. అదిత్య భరద్వాజ్.. AL విజయ్ లు జయలలిత బయోపిక్ లు ప్రకటించారు. వీరితో పాటు టాలీవుడ్ లెజెండ్ దివంగత దాసరి నారాయణరావు గారు బ్రతికి ఉన్నప్పుడు జయ బయోపిక్ ప్రకటించారు. అయన ఇప్పుడు లోకంలో లేరు కాబట్టి ఆ విషయం అప్రస్తుతం. ఇక తాజాగా ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కనున్న బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. 'ది ఐరన్ లేడీ' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్టార్ డైరెక్టర్ AR మురుగాదాస్ రిలీజ్ చేశాడు.
తమిళ నాడు అసెంబ్లీ బ్యాక్ గ్రౌండ్ ఫొటో తో ఈ ఫస్ట్ లుక్ ఉంది. 'ఎ స్టొరీ ఆఫ్ రెవల్యూషనరీ లీడర్' అనే క్యాప్షన్ ఇచ్చారు. పైనేమో జయలలిత గురించి హిల్లరీ క్లింటన్ చెప్పిన ఒక కొటేషన్ ఇచ్చారు. "ఆమె ఎవరితో పోల్చలేని చాలా సమర్థవంతమైన బలమైన నాయకురాలు. మహిళల పురోగతికి ఆమె ఒక తిరుగులేని ప్రతీక" అనేది ఆ కొటేషన్.
ఈ సినిమాలో జయ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది. త్వరలో ఈ సినిమాను గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రారంభిస్తామని కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ లో తెలిపారు.