Begin typing your search above and press return to search.

కోలీవుడ్ కపుల్ ఫ్యాషన్ అవతారం

By:  Tupaki Desk   |   22 May 2017 12:29 PM GMT
కోలీవుడ్ కపుల్ ఫ్యాషన్ అవతారం
X
కేన్స్‌ లో చాలామంది భారతీయ తారలే సందడి చేశారు. ఉత్తరాది భామలు ఐశ్వర్యారాయ్.. దీపికా పదుకొనేలతోపాటు దక్షిణాది నుంచి శృతి హాసన్ కూడా సందడి చేసింది. సంఘమిత్ర మూవీ లాంఛింగ్ కార్యక్రమాన్ని కేన్స్ సాక్షిగా యూనిట్ నిర్వహించగా.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారుల్లో ఒకడైన జయం రవి అందరినీ ఆకట్టుకున్నాడు.

జయం రవి.. అతని భార్య ఆర్తి రవిలు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తెగ మెరిసిపోయారు. నీరజ కోన స్టైలింగ్ లో ఈ జంట కేన్స్ లో తమ స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు రకాల డ్రెసింగ్ లలో అదరగొట్టేశారు జయం రవి జంట. రెడ్ కార్పెట్ పై పోజులు ఇచ్చేటపుడు అయితే.. ఈ జంట స్టైలింగ్ విపరీతంగా ఆకట్టుకుంది. డిఫరెంట్ సూట్ బూట్ లతో జయం రవి ఆకట్టుకోగా.. అతని భార్య ఆర్తి రవి అయితే.. మరింతగా మెరిసిపోయింది. మొదట గ్లామర్ టచ్ ఇచ్చిన ఇచ్చిన మెరిసిన ఆర్తి.. భర్తతో కలిసి భలే హొయలు పోయింది.

మరోసారి దేశానికే యువరాణి అనిపించే స్థాయిలో డ్రెసింగ్ చేసుకుని పోనీ టైల్ తో చూడముచ్చటగా కనిపించింది ఆర్తి. ఆ సమయంలో బ్లూ కలర్ అర్మనీ సూట్ తో జయం రవి భలేగున్నాడు.. చివరగా గ్రీన్ లెహంగాతో ఆర్తి రవి కనిపించిన లుక్.. మొత్తంలోకి హైలైట్ అనాల్సిందే. ఒక భారతీయ జంట ఈ స్థాయిలో కలిసి కేన్స్ లో మెరుపులు మెరిపించడం అరుదైన విషయమే.