Begin typing your search above and press return to search.

ఆవిడా... మా ఆవిడ ఫ్రెండే

By:  Tupaki Desk   |   30 July 2015 7:38 AM GMT
ఆవిడా...  మా ఆవిడ ఫ్రెండే
X
కొన్ని నిజాలు తెలుసుకుంటే చాలా ఆసక్తికరం అనిపిస్తాయి. పరిశ్రమలో కొన్ని స్నేహాలు యాధృచ్ఛికమే అయినా వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ తరహాలో ఓ హీరో, ఓ హీరోయిన్‌ నిజజీవితంలో ఫ్రెండ్ షిప్ ఇప్పుడు కోలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌.

క్యూట్‌ త్రిష, హీరో జయం రవి కోలీవుడ్‌ లో ఒకేసారి కెరీర్‌ ప్రారంభించారు. అప్పట్నుంచి ఈ ఇద్దరూ చాలా స్నేహాన్ని కొనసాగించారు. ఉనక్కుమ్‌ ఎనక్కుమ్‌ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అదిరిపోయిందన్న ప్రశంసలొచ్చాయి. ఆ తర్వాత కలిసి నటించాలనుకున్నా సందర్భం కుదరలేదు. ఎవరి కెరీర్‌ లో వాళ్లు బిజీ అయిపోయారు. మళ్లీ చాలా కాలానికి ఇలా జంటగా ఓ సినిమాలో నటించి కెరీర్‌ తొలినాళ్లను గుర్తు చేసుకుంటున్నారు.

సౌత్‌ స్టార్స్‌ గా దశాబ్ధం పైగానే కెరీర్‌ ని సాగించారు ఈ ఇద్దరూ. లేటెస్టుగా 'సకలకళావల్లవన్‌' చిత్రంలో జయం రవి, త్రిష జంటగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌ లో జయం రవి ముచ్చటిస్తూ .. త్రిష ఎప్పట్నుంచో స్నేహితురాలు. కలిసే కెరీర్‌ ప్రారంభించాం. జంటగా నటించాం. మా ఆవిడకు కూడా తను బెస్ట్‌ ఫ్రెండ్‌... అంటూ చెప్పుకొచ్చాడు.