Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: జస్ట్ పదహారేళ్ళు కోమాలో ఉన్నావ్ రా
By: Tupaki Desk | 3 Aug 2019 5:48 PM GMTజయం రవి.. కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తమిళ కామెడీ చిత్రం 'కొమాలి'. ఈ చిత్రానికి దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమా ట్రైలర్ ఈ శనివారం నాడు రిలీజ్ అయింది. 2.15 నిముషాల ట్రైలర్ లో సినిమా థీమ్ ను దాచిపెట్టకుండా వెల్లడించారు.
ట్రైలర్ ప్రారంభంలోనే హాస్పిటల్ లో కళ్ళు తెరిచిన జయం రవి.. మాసిన గడ్డంతో తనను తాను అద్దంలో చూసుకొని కెవ్వుమంటూ అరుస్తాడు. "నువ్వు ఇప్పటివరకూ కోమాలో ఉన్నావ్ రా" అంటూ ఫ్రెండ్ యోగిబాబు చెప్తాడు. "ఎన్నాళ్ళు?" అని జయం రవి అడిగితే "జస్ట్ పదహారేళ్ళు రా" అంటూ యోగిబాబు బదులిస్తాడు. షాక్ తినడం జయం రవి వంతు. ఇక చూసుకోండి.. ఫన్ స్టార్ట్. పదహారేళ్ళ క్రితం ఇండియా ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. దీంతో జయం రవి లైఫ్ రచ్చగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లు.. ఫ్లాట్ టీవీలు.. హంగామాను తట్టుకోలేడు. ఇక మన హీరో చిన్నప్పుడు చూసిన చెన్నైకి ఇప్పటి చెన్నైకి ఎంత తేడా ఉంటుందనే విషయాన్ని ఫ్రెండ్ తో స్కూటర్ లో వెళ్తూ రోడ్డుకు అటూ ఇటూ ఉండే టాల్ బిల్డింగ్స్ చూస్తూ .."రేయ్.. చెన్నై అమెరికా మాదిరిగా మారిపోయిందిరా" అని ఒక్క డైలాగ్ లో చెప్పేస్తాడు. మరో సీన్ లో బడ్డీ కొట్టు దగ్గర బిల్ సెటిల్ చేస్తూ జయం రవి "రెండు టీలు ఒక సిగరెట్.. చిల్లర ఇవ్వు వెళ్ళాలి" అంటూ మూడు రూపాయలిచ్చి సీరియస్ గా డైలాగ్ చెప్తే "నువ్విచ్చిందే చిల్లర" అంటూ షాప్ అతను పంచ్ వేస్తాడు. ఇలా సాగుతుంది.. మన హీరో వ్యవహారం.. ట్రైలర్ లో చాలానే ఫన్నీ సీన్లు ఉన్నాయి.
థీమ్ బాగుంది. స్టార్ కాస్ట్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది. హిప్ హాప్ తమిళ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు తగ్గట్టే ఉన్నాయి. ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయమని అనిపిస్తోంది. ఇంకా ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ ను చూసేయండి. తమిళం రాదంటారా.. జై బోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కో!!