Begin typing your search above and press return to search.
'క్రాక్' చూసిన వాళ్ల నోట 'జయమ్మ' మంత్రం!
By: Tupaki Desk | 14 Jan 2021 1:30 PM GMTరవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'క్రాక్' సినిమా, 'సంక్రాంతి కానుకగా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ ఖాతాలో చాలా హిట్లే ఉన్నప్పటికీ, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు ప్రత్యేకమైన కేటగిరిలో నిలిచాయి. అలాంటి కేటగిరిలో చేరిపోయిన సినిమాగా 'క్రాక్' కనిపిస్తుంది. తొలి ఆటతోనే రెండు రాష్ట్రాల్లోను ఈ సినిమా హిట్ అంటూ రిపోర్ట్స్ వచ్చేశాయి. అంతేకాదు రవితేజ కెరియర్లోనే ఇది అతి పెద్ద హిట్ అనికూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ వైజాగ్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ తో సందడి చేసేసింది కూడా.
రవితేజ సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ కనువిందు చేయగా, వరలక్ష్మీ శరత్ కుమార్ .. సముద్రఖని కీలకమైన పాత్రలను పోషించారు. సాధారణంగా సినిమా చూసినవారు హీరో గురించి గానీ .. హీరోయిన్ గురించిగానీ మాట్లాడుకుంటారు. కానీ ఆ ఇద్దరినీ మించి విలన్ గురించి మాట్లాడుకోవడం విశేషం. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది .. ఆమె పాత్ర పేరు .. 'జయమ్మ'. ఇప్పుడు ఈ పాత్రను గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఆమెను 'జయమ్మ'గానే చెప్పుకుంటున్నారు. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆమె ఆ పాత్రను పోషించిన విధానం ప్రేక్షకులకు అంతగా నచ్చేశాయి.
వరలక్ష్మీ శరత్ కుమార్ లో గొప్పనటి ఉందనీ, ఆమెతో మరో సినిమా చేయాలని ఉందని రవితేజ అన్నాడంటే ఆమె టాలెంట్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. తమిళంలో విలనీ రోల్స్ చేయడం ఆమెకి అలవాటే. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లోనే ఆమె ఈ తరహా పాత్రలను చితగ్గొట్టేసింది. తెలుగులో ఆ మధ్య ఆమె చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'లోని విలన్ రోల్ కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. త్వరలో రానున్న 'నాంది'లోను ఆమె కీలకమైన రోల్ చేస్తోంది. ఇప్పటికే తమిళంలో ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ఇక తెలుగులోను ఆమె బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.