Begin typing your search above and press return to search.

కమెడియన్ సినిమాకు యు/ఎ ఇచ్చారు

By:  Tupaki Desk   |   8 Nov 2016 5:23 AM GMT
కమెడియన్ సినిమాకు యు/ఎ ఇచ్చారు
X
స్టార్ కమెడియన్ శ్రీనివాసరెడ్డి.. పూర్ణ జంటగా నటిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చి.. చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. గీతాంజలి లాంటి సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్న ఈ స్టార్ కమెడియన్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నెలకొంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంఛ్ చేయడం... ఆ తరువాత దర్శకుడు సుకుమార్ టీజర్ లాంఛ్ చేయడం వల్ల ఈ చిత్రం యూనిట్ కి బాగా కలిసొచ్చింది.

అంతేకాదు.. ఈ చిత్రం బిజినెస్ కూడా హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ఏడు కోట్ల రూపాయలకు బిజినెస్ చేయడం వల్ల ఈ చిత్రం విజయం పై డిస్ట్రిబ్యూటర్లకున్న నమ్మకం ఏంటో తెలిసిపోతోంది. హీరో నితిన్ డాడీ సుధాకర్ రెడ్డి ఈ చిత్రం నైజాం హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ బిజినెస్ కూడా బాగానే చేసిందనే టాక్ వుంది. విడుదలకు ముందే ఇంత పాజిటివ్ బజ్ తో హడావుడి చేసిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీ ఈ నెల 24న విడుదలవుతోంది. చూడాలి... విడుదలైన తరువాత బాక్సాఫీస్ వద్ద ఇంకెంత హడావుడి చేస్తుందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/