Begin typing your search above and press return to search.

మ‌హేష్ మైండ్ బ్లాంక్ చేసిన ద‌ర్శ‌కుడు!

By:  Tupaki Desk   |   2 Dec 2015 9:58 AM GMT
మ‌హేష్ మైండ్ బ్లాంక్ చేసిన ద‌ర్శ‌కుడు!
X
మ‌హేష్ తో ఒక‌సారి సినిమా చేస్తే చాల‌దు మ‌ళ్లీ మ‌ళ్లీ త‌న‌తో సినిమా చేయాల‌ని ఏ ద‌ర్శ‌క నిర్మాత‌కైనా ఉంటుంది. అయితే ఇటీవ‌ల ఒక ద‌ర్శ‌కుడు మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌నకు ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి ఇష్ట‌మొచ్చినంత రెమ్యూనిరేష‌న్ రాసుకోండి అన్నాడ‌ట‌. దీంతో మ‌హేష్ మైండ్ బ్లాంక్ అయింద‌ట‌. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఆ క‌థా క‌మామీషు ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న శేఖ‌ర్ క‌మ్ముల మ‌హేష్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ ఆ మధ్య చాలా వార్త‌లు వ‌చ్చాయి. కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇటీవ‌ల ఒకానొక సంద‌ర్భంలో మ‌హేష్ - శేఖ‌ర్ క‌మ్ముల క‌లుక‌సుకున్నార‌ట‌. అప్పుడు వారి క‌ల‌యిక‌లో చేద్దామ‌న‌కున్న స్టోరీ లైను గురించి కాసేపు చ‌ర్చించుకున్నార‌ట కూడా. ఆ స్టోరీ ని డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని మ‌హేష్ చెప్పిన‌ట్లు వినికిడి. ప్ర‌స్తుతం ఆ పనిలో బిజీ బిజీగా ఉన్నాడ‌ట శేఖ‌ర్ క‌మ్ముల‌.

ఇదిలా ఉంటే గ‌తంలో మ‌హేష్ బాబుతో ట‌క్క‌రి దొంగ సినిమా సినిమా చేశాడు జ‌యంత్ సి ప‌రాన్జీ. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా రాలేదు. కానీ వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం అప్ప‌టి నుంచి అలాగే ఉంద‌ట‌. ఆ సాన్నిహిత్యంతో ఓ రోజు మ‌హేష్ ఇంటికి బ్లాంక్ చెక్ తో వెళ్లి క‌లిశాడ‌ట జ‌యంత్‌. అయితే జ‌యంత్ -మహ‌ష్ ని క‌లిసింది మాత్రం డైరక్ట‌ర్ గా కాదు. శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ష్ సినిమా ఫైన‌ల్ చేస్తే దాన్ని జ‌యంత్ నిర్మిస్తాడ‌ట‌. క‌థ ఫైన‌ల్ అయ్యాక కూర్చోని మాట్లాడ‌దాం అన్నాడ‌ట మ‌హేష్‌. మ‌నం క‌లిసి క‌చ్చితంగా సినిమా చేస్తున్నామ‌ని మాట కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే శేఖ‌ర్ కమ్ముల - జయంత్ పర్హాన్జీల చిత్రాన్ని ముర‌గ‌దాస్ సినిమా స‌గంలో ఉండ‌గా ప్రారంభించాల‌నుకుంటున్నాడ‌ట మ‌హ‌ష్‌. చూద్దాం అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉంటుందో.