Begin typing your search above and press return to search.

సరికొత్త ఫీట్ చేసిన సీనియర్ నటి

By:  Tupaki Desk   |   29 Jun 2015 3:00 PM IST
సరికొత్త ఫీట్ చేసిన సీనియర్ నటి
X
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి, తర్వాత కీలక పాత్రల్లో కనిపిస్తుంటారు కొంతమంది నటీమణులు. లేదంటే బుల్లి తెరకు పరిమితమవుతారు. కొంతమంది మరీ ప్రత్యేకంగా రాజకీయాల్లో ప్రత్యక్షమవుతారు. వీటన్నిటినీ కాదని సరికొత్త ఫీట్ చేసింది ఓ నటీమణి.

నటిగా, రాజకీయ నాయకురాలిగా పరిచితమైన జయప్రద గాయనిగా సరికొత్త అవతారం ఎత్తారు. తమిళంలో తెరకెక్కిన ఉయిరే ఉయిరే సినిమాతో తనలోని గాయనిని తమిళ ప్రేక్షకులకు పరిచయం చేశారు జయప్రద. తన మేనల్లుడు సిద్ధూ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇష్క్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక నాయిక కాగా మాతృకలో స్వరాలూ సమకూర్చిన అనూప్ ఇక్కడా దరువేశారు. మరో ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ సినిమాకి జయప్రదతో పాటు సమాజ్ వాది పార్టీ నాయకుడు అమర్ సింగ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొన్నీమధ్య చెన్నై లో జరిగిన ఆడియో లాంచ్ కి మోహన్ బాబు, అనిల్ కపూర్ లాంటి వారంతా వెళ్లి జయప్రద మేనల్లుడికి విజయం సిద్ధించాలని ఆశీర్వదించారు.