Begin typing your search above and press return to search.
కొత్త ప్లాన్స్‌తో వస్తున్నా.. వెయిట్ -జయప్రద
By: Tupaki Desk | 3 July 2015 2:05 PM GMTఉత్తరాది, దక్షిణాది రెండుచోట్లా ఫేమస్ పర్సనాలిటీ జయప్రద. కథానాయికగా, రాజకీయనేతగా, టీవీ హోస్ట్‌గా అందరికీ సుపరిచితం. దశావతారం తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోకపోయినా 'జయప్రదం' పేరుతో సెలబ్రిటీల్ని ఇంటర్వ్యూలు చేస్తూ తెలుగువారికి జయప్రద టచ్‌లోనే ఉన్నారు. ఇటీవలే తనయుడు విజయ్‌ని హీరోని చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా జయప్రద చెప్పిన షేర్ చేసుకున్న విషయాలను ఓసారి చూద్దాం.
చాలా కాలంగా కనిపించడం లేదు?
అలాంటిదేం లేదు. పరిశ్రమకు నేనెప్పుడూ దూరంగా లేను. దశావతారం తర్వాత పొరుగు భాషల్లో బిజీ అయ్యాను. కొత్త ప్రణాళికలతో మళ్లీ వస్తున్నా. కాస్త వేచి చూడండి.
రాజకీయాల్లో ఎంట్రీ.. మీ అనుభవాలు?
చాలా మంది చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్న ఇది. దానికి కారణం ఉంది. ఓ నటిగా సన్నివేశంలో నటించాలంటే ముందుగానే బోలెడంత ప్రిపరేషన్‌తో వచ్చేదాన్ని. కానీ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు అలాంటిదేం లేదు. ఆ సందర్భం అలా కలిసొచ్చింది అంతే. నేను ఫూల్‌ని. ఏదీ ప్లాన్ చేయలేదు. నేనొక సామాన్యురాలిని. ఆంధ్రాలోని రాంపూర్‌కి చెందిన అమ్మాయిని. రాజకీయాల్లో వెలిగిపోవడం అంటే ఆషామాషీ కాదు. అయినా అలా వెళ్లడం నటికి ఎక్స్‌టెన్షన్ మాత్రమే. గుర్తింపులోనూ ఎక్స్‌టెన్షన్ కోసమే. బాలీవుడ్ పుణ్యమా అని నాకు ఆ సదవకాశం వచ్చింది. ప్రజలకు సేవ చేద్దాం. మారుద్దాం అనుకున్నా. అవన్నీ జరిగే పనులా?
రాజకీయాల్లోకి తిరిగి వెళతారా?
అలాంటి ఆలోచనల్లేవ్. అదో విచారకరమైన ప్రపంచం. ప్రస్తుతానికి నటనపై దృష్టి సారిస్తున్నా.
అక్కడ వెన్ను చూపారెందుకు?
నేను తలలు తీయలేను, హత్యలు చేయలేను.
రాజకీయ నేతగా ఉన్నప్పుడు వివాదాలొచ్చాయి కదా!
పొలిటికల్ కెరర్‌లో ఎమ్మెల్యే ఎంపీ అవ్వడానికి నా వెంట ఎవరూ రాలేదు. సపోర్ట్ లేనేలేదు. అంతేనా విమర్శలెన్నో వచ్చాయి. వాటన్నిటికీ ఆరంభం ఏడ్చేసేదాన్ని. కాలక్రమంలో అలవాటైంది. పార్లమెంటులో అడుగుపెట్టాక అరవడం నేర్చుకున్నా. అక్కణ్ణుంచి అన్నీ అలవాటైపోయాయి. నిమిషాలు, గంటల కొద్దీ ప్రసంగించగలను. నా నియోజక వర్గంలో ఏదైనా రేప్, హత్య జరిగినా నేను నెర్వస్ అయిపోయేదాన్ని. ఏదీ మాట్లాడలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు అన్నిరకాలా సాన బట్టబడి ఉన్నా.
అమర్‌సింగ్‌తో ఎఫైర్ గురించి వార్తలొచ్చాయి?
అవన్నీ మామూలే ఇక్కడ. ఒకే హీరోతో నాలుగు సినిమాల్లో నటిస్తే ఎఫైర్ అంటగట్టేస్తారు. ఇదీ అంతే. రాజకీయాల్లోకి వచ్చాక నాకు హిందీ స్పీచ్ రాసిచ్చింది ఆయనే. ఎలా మాట్లాడాలి. ప్రొనౌన్సియేషన్ అన్నీ తనే దగ్గరుండి నేర్పించాడు. అంత మాత్రాన అలా లింకులు అంటగట్టేస్తారా?
సినీ రీఎంట్రీ గురించి?
నా శరీరభాషకు తగ్గ అవకాశాలొస్తే నటించడానికి సిద్ధమే. వయసుకు తగ్గ పాత్రలు చేస్తా. అయితే ముసలమ్మల్ని కూడా గ్లామర్‌గానే చూపిస్తున్నారు. అలాంటి వాటికి నేను సిద్ధమే. మీకు తెలిసిందే. నేను సాగర సంగమంలోనూ ముసలమ్మ గెటప్‌లో కనిపించా. అలాగే సిద్ధార్థ్- హన్సిక జంటగా ఉయిరే ఉయిరే చిత్రాన్ని నిర్మిసప్తున్నా.
...అంటూ ముగించారు జయప్రద!!!