Begin typing your search above and press return to search.

పునీత్ మరణాన్ని తలుచుకొని కన్నీటి పర్యంతం అయిన జయప్రద..

By:  Tupaki Desk   |   7 Nov 2021 1:30 AM GMT
పునీత్ మరణాన్ని తలుచుకొని కన్నీటి పర్యంతం అయిన జయప్రద..
X
పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ సినీ ప్రముఖులు తట్టుకోలేకపోతున్నారు. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేసింది 29 సినిమాలే అయినా ప్రేక్షకుల నుంచి అంతులేని అభిమానం సంపాదించుకున్నారు. కన్నడ పవర్ స్టార్ గా ఎదిగాడు. మొన్నటివరకు ఎంతో సందడి చేసిన హీరో ఇప్పుడు తిరిగి రాని లోకాలకు పయనమయ్యాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు రావడంతో కుప్పకూలి మరణించాడు.

పునీత్ మరణంతో కన్నడ ఇండస్ట్రీ మూగబోయింది. ఇంత చిన్న వయసులో పునీత్ అందరినీ వదిలి వెళ్లిపోవడం ఏంటని అంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక పునీత్ కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తున్నారు సినిమా తారలు.. ఇప్పటికే పలువురు నటులు పునీత్ కుటుంబాన్ని ఓదార్చారు.

తాజాగా సీనియర్ నటి జయప్రద పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ మన మధ్య లేడు అంటే నమ్మలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు జయప్రద. మనసుకు చాలా కష్టంగా ఉంది అన్నారు. రాజ్ కుమార్ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం.. ఈ కుటుంబంలో నేను మెంబర్ గా ఉన్నాను. ఎంతో గొప్ప నటుడిగా.. గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్న అప్పు చిన్న వయసులోనే మననుంచి వెళ్లిపోయాడంటే చాలా కష్టంగా ఉంది అన్నారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమోషనల్ అయ్యారు జయప్రద.

x ఇప్పటికీ పునీత్ ను తలుచుకుంటోంది. శాండిల్ వుడ్ తోపాటు ఇతర సినీ పరిశ్రమ ప్రముఖులు బెంగళూరు వచ్చి నివాళులర్పిస్తున్నారు. ఆయన అకాల మరణ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.