Begin typing your search above and press return to search.
డ్యూయల్ రోల్ లో జేపీ
By: Tupaki Desk | 13 Sep 2015 5:01 AM GMTకామెడీ గ్యాంగ్ ని యూజ్ చేసుకోవడంలో దర్శకుడు శ్రీనువైట్లకి తిరుగులేదు. ఆయనకి కోన అండ్ గోపీ గ్యాంగ్ కూడా తోడైందంటే ఇక ఆ సినిమాలో కామెడీ సూపర్ డూపర్ హిట్టే. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకొని బయటికి రావల్సిందే. కొంత విరామం తర్వాత శ్రీనువైట్ల, కోన వెంకట్, గోపీమోహన్ కలిసి చేసిన సినిమా కావడంతో `బ్రూస్‌లీ`లో కామెడీ పైన చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కామెడీని పక్కాగా రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా జయప్రకాష్ రెడ్డి క్యారెక్టర్ హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ రిపోర్ట్. ఆయన డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.
`ఢీ`లో జయప్రకాష్ రెడ్డితో శ్రీనువైట్ల కామెడీ చేయించిన విధానం అదుర్స్ అనిపించింది. అస్సలు ఆయనకి డైలాగులు లేకుండానే ఆ సినిమాలో నవ్వులు పండేలా చేశాడు వైట్ల. ఆ తర్వాత `రెఢీ`లోనూ జేపీని బాగా వాడుకొన్నాడు. శ్రీనువైట్ల వాడకం మొదలుపెట్టాక కామెడీ కోసం చాలా మంది జేపీని విజయవంతంగా ఉపయోగించుకొన్నారు. రామ్ చరణ్ `నాయక్`లోనూ జేపీ కామెడీ బాగా పండింది. ఇప్పుడు మరోసారి జయప్రకాష్ రెడ్డిని వాడుకొని కామెడీ ఇరగదీశాడట వైట్ల. జేపీ పోషించిన రెండు పాత్రల మధ్య వచ్చే కన్ ఫ్యూజన్ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుందని సమాచారం. సినిమా మొత్తానికి ఆయన పాత్రే హైలెట్ కావచ్చని అంటున్నారు. ఆయనకి తోడుగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా నవ్వులు బాగా పండించాడని తెలుస్తోంది.
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న `బ్రూస్‌లీ` చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. చిరుపై ఓ సాంగ్, కొన్ని సన్నివేశాలు తీస్తే దాదాపుగా సినిమా పూర్తయినట్టే. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ ఫైటర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది.