Begin typing your search above and press return to search.

భర్త అక్రమ సంబంధం..ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం!

By:  Tupaki Desk   |   18 Jan 2020 10:48 AM IST
భర్త అక్రమ సంబంధం..ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం!
X
ఇద్దరూ ప్రముఖ టీవీ నటులు.. సినిమాల్లోనూ చిన్నా చితక పాత్రలు చేశారు. అయితే ఈ సినిమా ఇండస్ట్రీలోనే భర్త మరో ఎఫైర్ పెట్టుకున్నాడని.. రోజూ తనను, తన కుమార్తెను తాగి వచ్చి హింసిస్తున్నాడని నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ లొల్లి జరుగుతుండగా భర్త ఫోన్ చేయడం.. ఆ నటి సూసైడ్ నోటి రాసి ఆత్మహత్యయత్నం చేయడం జరిగిపోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య సీరియస్ గా ఉన్న నటి బతుకుతుందా లేదా అన్నది తమిళనాట టెన్షన్ నెలకొంది.

చెన్నైలోని తిరువాణ్మయర్ కు చెందిన జయశ్రీ, ఈశ్వర్ దంపతులు ప్రముఖ తమిళ టీవీ సీరియల్ నటులు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. భర్త ఈశ్వర్ కు వేరే నటితో వివాహేతర సంబంధం ఉందని, నిత్యం వేధిస్తున్నాడని.. కుటుంబ సభ్యులు ఆయనకే మద్దతు తెలుపుతున్నారని జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వీరి కేసు కోర్టులో ఉంది.

అయితే తాజాగా జయశ్రీకి భర్త ఈశ్వర్ నుంచి ఫోన్ రావడం.. వాదులాడుకోవడంతో విరక్తి చెందిన జయశ్రీ నిద్రమాత్రలు కొని మింగేసింది. ఆమె సహాయకుడు చూసి ఆస్పత్రిలో చేర్పించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తన కుమార్తెను తాను చనిపోయాక భర్త బాగా చూసుకోవాలని.. తన తల్లిదండ్రులు ఆలనా పాలనా చూడాలని.. సూసైడ్ నోట్ లో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాసుకొచ్చింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.