Begin typing your search above and press return to search.
ముంబయి హీరోయినైతే చాలు కుక్కలకు కూడా స్పెషల్ రూమ్‌లు.. ఇండస్ట్రీలో వివక్ష
By: Tupaki Desk | 30 July 2022 5:53 AM GMTటాలీవుడ్ తెరపై నిన్నటితరం కథానాయికగా ఒక వెలుగు వెలిగినవారిలో జయసుధ ఒకరు.1972లో వచ్చిన 'పండంటికాపురం' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత ఇండస్ట్రీలో కుదురుకోవడానికి ఆమె ఎక్కువ సమయం తీసుకోలేదు. ఒక వైపున శారద .. వాణిశ్రీ వంటి తన సీనియర్స్ నుంచి .. మరో వైపున తన తోటి హీరోయిన్స్ శ్రీదేవి - జయప్రద నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆమె తట్టుకుని నిలబడ్డారు. నటన ప్రధానమైన పాత్రలతోనే మెప్పిస్తూ సహజ నటిగా వాళ్ల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు.
అలాంటి జయసుధ నటిగా 50 వసంతాలను పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకి సంబంధించిన అనేక ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన ప్రశ్నలను ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు రన్ అవుతోంది. ప్రోమోలోని అంశాలను టచ్ చేస్తే .. "నటిగా 50 ఏళ్లను పూర్తి చేసుకుంటే ఏ బాలీవుడ్ లోనో అయితే ఫ్లవర్ బొకే అయినా పంపిస్తారు .. ఇక్కడ అది పంపించినవాళ్లు కూడా లేరు. అదే ఒక హీరో అయితే ఆ హడావిడి వేరేగా ఉండేది.
నటిగా సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో హీరోలను ఒక రకంగా .. హీరోయిన్లను ఒక రకంగా ట్రీట్ చేయడం ఉందనిపించింది. బాగా సక్సెస్ అయిన హీరోలను ఒకలా చూస్తారు. హీరోల కంటే హీరోయిన్స్ ను తక్కువగా ట్రీట్ చేయడం ఉంది.
టాప్ హీరోయిన్ అయిన తరువాత కూడా అలా ట్రీట్ చేయడం చూశాను. ఏ విషయంలోనైనా నా వైపు నుంచి ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంచేవారు కాదు .. ఎప్పుడో పంపించేసేవారు. ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ముంబై నుంచి వచ్చినవారి కుక్కపిల్లకి కూడా రూమ్ ఇస్తున్నారు.
ఎప్పుడూ కూడా హీరోల వైపు నుంచి ఎలాంటి సమస్య ఉండదు. డ్రామా అంతా ఆ పక్కన ఉండే వాళ్లదే ఉంటుంది. హీరో సరిగ్గా డాన్స్ చేయకపోయినా, ఏంటి మూమెంట్ సరిగ్గా ఇవ్వడం లేదని మమ్మల్ని అడుగుతుంటారు. చాలా కెరియర్ చూశాను .. కానీ డబ్బులు ఎక్కువగా కూడబెట్టలేకపోయాను.
శోభన్ బాబుగారు 'ఏవోయ్' అని పిలిచేవారు. "ఫలానా చోట మంచి ప్లేస్ ఉంది .. మీ నాన్నగారితో చెప్పి అది తీసుకో" అనేవారు. సావిత్రి గారి 'మహానటి' కాస్త ముందు గా తీసి ఉంటే బాగుండేది .. నేను సినిమాలు తీసి నష్టపోయేదానిని కాదు" అంటూ ఆమె నవ్వేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ ఇంటర్వ్యూ ఈ ఆదివారం రాత్రి ప్రసారం కానుంది.