Begin typing your search above and press return to search.
సహజనటి.. సయోధ్య కుదిర్చేశారట
By: Tupaki Desk | 2 Dec 2016 11:30 AMసహజ నటి అనే బిరుదుతోపాటు.. డైరెక్టర్ల యాక్ట్రెస్ గా జయసుధకు బోలెడంత మంచి పేరు ఉంది. సినిమాకు ఏం కావాలో అది ఇవ్వడమే తప్ప.. వేరే పనిలో వేలు పెట్టనే పేరు ఉన్న ఆమె చుట్టూ.. తాజాగా ఓ వివాదం చుట్టుకుంది. ఆర్ నారాయణ మూర్తితో కలిసి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'లో జయసుధ నటిస్తుండగా.. దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో గొడవ రావండతో ఈ మూవీ సెట్స్ నుంచి జయసుధ వాకౌట్ చేశారనడం సంచలనం అయింది.
ఇప్పుడీ గొడవకు అసలు కారణం తెలియవచ్చింది. జయసుధకు తన గెటప్.. మేకప్ వంటివి అన్నీ పూర్తి చేసుకుని సెట్స్ కు రావడం అలవాటు. గత ముప్ఫై ఏళ్లుగా తన డ్రస్సులను తనే డిజైన్ చేసుకుంటున్నారామె. ఆమెకు ఇవ్వాల్సి కాస్ట్యూమ్స్ విషయంలో ఆలస్యం జరిగింది. దీంతో ఆమె రెడీ అయ్యి సెట్స్ కు రావడం కూడా లేట్ అయింది. ఈ విషయం తెలియని చదలవాడ.. తన అసహనాన్ని జయసుధ పర్సనల్ స్టాఫ్ దగ్గర వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని దర్శకుడికి తెలియచేయడంతో వివాదం సమసిపోయింది.
'ఇందులో పెద్ద వివాదమేదీ లేదు. చిన్న అపార్ధం అంతే. దర్శకుడు నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. డిసెంబర్ 3నుంచి షెడ్యూల్ ప్రకారం తిరిగి షూటింగ్ మొదలవుతుంది' అని చెప్పారు జయసుధ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/