Begin typing your search above and press return to search.
RX100 రైట్స్ కొని తీయనంటే ఎలా?
By: Tupaki Desk | 3 Jun 2019 4:56 AM GMTసినిమా చూసి ఎగ్జయిట్ అయ్యి కొన్నాను.. కానీ ఆ సినిమా తీయలేను!! అనేస్తున్నాడు జేడీ చక్రవర్తి. ఇంతకీ ఏ సినిమా అంటే? 2018 బ్లాక్ బస్టర్ మూవీ ఆర్.ఎక్స్ 100 రైట్స్ కొనుక్కుని తన వద్దనే ఉంచుకున్నాడట జేడీ. కానీ ఆ సినిమా తీయాలంటే తన వల్ల కాదని అనేశాడు.
ఇటీవల రిలీజైన సినిమాల్లో ఆర్.ఎక్స్ 100 .. అర్జున్ రెడ్డి చిత్రాలు బలమైన కంటెంట్ ఉన్నవి అంటూ పొగిడేసిన జేడీ .. ఆర్జీవీ కాంపౌండ్ లో పని చేసిన అజయ్ భూపతి తీసిన ఆర్.ఎక్స్ 100 చూడగానే ఎగ్జయిట్ అయిపోయారట. అంతేకాదు వెంటనే రైట్స్ కొనేశానని వేరే భాషలో తీయాలని అనుకున్నానని తెలిపాడు. రైట్స్ నా దగ్గరే ఉన్నాయి.. కానీ తీయను అని తెలిపారు. కార్తికేయ - అజయ్ భూపతి టీమ్ తిరిగి చేస్తేనే RX100 మ్యాజిక్ రిపీటవుతందనిపించి వదిలేశానని అన్నారు. ఎగ్జయిట్ అయ్యి కొనేసినా .. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ..అని చెప్పారు.
న్యూఏజ్ సినిమాల్లో అర్జున్ రెడ్డి చాలా సినిమాలకు ధైర్యాన్నిచ్చింది. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా ఇటీవల తనని ఎగ్జయిట్ చేసిన సినిమా ఇది అని చెప్పాడు. డ్రగ్స్ .. మత్తు .. లిప్ లాక్ ఇవి ఉన్నాయని కాదు.. ఎమోషన్స్ బలంగా ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. సన్నివేశం ఏదైనా ఎమోషన్ ముఖ్యం. ఎమోషన్ కనెక్టయితే సినిమాని ప్రేక్షకులకు పెద్ద హిట్టిస్తున్నారని విశ్లేషించారు. టెక్నాలజీ బేస్డ్ సినిమాలు చేశారు. మీ సినిమాల్లో టెక్నాలజీ డామినేట్ చేసింది. అయినా ఆర్జీవీ కాంపౌండ్ లో ఎందుకు `ఇన్సెప్షన్` లాంటి సినిమాలు రావు? మీ స్థాయి ఎందుకు పెరగలేదు? అన్న ప్రశ్నకు.. మునుముందు పెద్ద స్థాయి సినిమాలు చూస్తారని అన్నారు. అలాగే అక్టోబర్ లో తన నుంచి ఓ పెద్ద సినిమా చూడబోతున్నారని జేడీ వెల్లడించారు.