Begin typing your search above and press return to search.

న‌చ్చితేనే చేస్తా, అదే నా నైజం

By:  Tupaki Desk   |   4 Sep 2015 2:26 AM GMT
న‌చ్చితేనే చేస్తా, అదే నా నైజం
X
జేడీ చ‌క్ర‌వ‌ర్తి, గెడ్డం చ‌క్ర‌వ‌ర్తి, జేడీ ఇలా ఏ పేరు తో పిలిచినా ప‌లుకుతాడు. సూటిగా మాట్లాడ‌డం అత‌డి నైజం. గురువు వ‌ర్మ‌ తో పాటే రెండున్న‌ర ద‌శాబ్ధాలు గా సినీప‌రిశ్ర‌మ‌ లో కొన‌సాగుతూనే ఉన్నారు. లేటెస్టు గా విష్ణు హీరో గా న‌టించిన డైన‌మైట్ సినిమా లో జేడీ విల‌న్‌ గా న‌టించాడు. దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం హిట్ కొడుతుంద‌ని కాన్ఫిడెంటు గా చెబుతున్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే..

= తమిళ సినిమా 'అరిమా నంబి'లో నా న‌ట‌న‌కు, క్యారెక్ట‌ర్‌ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. రీమేక్‌ 'డైనమైట్'లో కూడా నేనే నటిస్తే బాగుంటుంద ని దేవ కట్టా భావించి క‌లిశారు. కానీ చేసిన పాత్రనే మళ్ళీ చేయడం బోరింగ్. అందు కే మొదట ఈ సినిమా లో నటించనని చెప్పా. దర్శకుడు మాత్రం నేనే చేయాలని పట్టుబట్టి తెలుగు రీమేక్ కోసం మార్పులు చేశారు. నాకు ఈ మార్పులు న‌చ్చేశాయి. ఓకే చెప్పేశా.

= అరిమా నంబి లో మైన‌స్‌ల‌న్నిటి నీ ఇక్క‌డ ప్ల‌స్ చేసేశాడు దేవా క‌ట్టా. ఇది స్క్రీన్‌ప్లే ఆధారిత చిత్రం. ట్రీట్‌మెంట్ చాలా కొత్త గా ఉంటుంది. హీరో, విలన్ మ‌ధ్య క్యాట్ అండ్ ర్యాట్ గేమ్ ఆక‌ట్టుకుంటుంది. ఇద్ద‌రి మధ్యన జరిగే ఈ గేమ్ నాకు మొదటిసారి విన్నప్పుడే విపరీతం గా నచ్చేసింది. మార్పులు చేశాక వ‌స్తున్న డైన‌మైట్ 'అరిమ నంబి' కంటే బావుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

=దేవకట్టాకు డెడికేష‌న్‌, సినిమా కోసం అత‌డు ప‌డే త‌ప‌న న‌చ్చుతాయి. విష్ణు – దేవకట్టాల కెమిస్ట్రీ, వాళ్ళ డెడికేషన్ ఈ సినిమాకే హైలైట్. దేవా కి ఎమోష‌న్‌ పై బాగా గ్రిప్ ఉంది. అది ఎలా పండాలన్నది సరిగ్గా తెలుసు. నేను ఈ రీమేక్‌ లో ఏమేం మార్పులు అవ‌స‌ర‌మ‌ని భావించానో అవన్నీ ముందే చేంజ్ చేసి పెట్టుకున్నాడు. తెలివైన దేవా.

= విష్ణు.. క్యారెక్ట‌ర్ కోసం ఎన్ని సాహసాలై నా చేస్తాడు. సాధారణం గా హీరో అంటే తనకే పూర్తి ప్రాధాన్యత ఉండాలని కోరుకునే వారుంటారు. విష్ణు కు మాత్రం సినిమా బాగా రావాలన్నదే ప్ర‌ధాన‌మైన టార్గెట్‌. నాకు తెలిసి ఇప్పుడున్న హీరోలం తా ఇలాంటి మార్పును కోరుకుంటున్నారు.
= ఓ ద‌ర్శ‌కుడి గా నేను వేరొక ద‌ర్శ‌కుడి క్రియేటివ్ విషయాల పరంగా అస్సలు జోక్యం చేసుకోను. అది మంచిది కాదు కూడా. అయితే ఒక పాత్ర చేస్తున్నపుడు ఏయే విషయాలు ఇంకా బాగా ఉండొచ్చని నాకనిపిస్తుందో వాటి గురించి మాత్రం ముచ్చ‌టిస్తుంటా.


= ఇటీవ‌ల‌ తెలుగులో సినిమాలు చేయలేదు. గ్యాప్ లో తమిళ, మలయాళ భాషల్లో రెండు, మూడు సినిమాలు చేశా. ముందు గా నేను ఏదైనా సినిమా ఒప్పుకోవాలంటే నాకు ఆ పాత్ర నచ్చాలి. నాకు నచ్చితేనే నేను సినిమా చేస్తా. అందుకనే తమిళం, మళయాలం లో రెండు పెద్ద హిట్ సినిమాల్లో నటించాక కూడా నేను పెద్దగా సినిమాలు చేసిందే లేదు.

= ప్రస్తుతం గురూజీ వర్మ ప్రొడక్షన్‌ లో ఓ సినిమా డిస్కషన్‌ లో ఉంది. నేనే ద‌ర్శ‌కుడిని. అలాగే వ‌ర్మ‌ దర్శకత్వం లో రూపొందే మరో సినిమా లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నా. తమిళంలో 'జీరో', 'భాస్కర్ ది రాస్కెల్' తెలుగు రీమేక్.. ఇలా సినిమాల‌న్నీ క్యూలో ఉన్నాయి.