Begin typing your search above and press return to search.

గెడ్డం చక్రవర్తికి త్వరలో పెళ్లి

By:  Tupaki Desk   |   17 April 2016 4:47 AM GMT
గెడ్డం చక్రవర్తికి త్వరలో పెళ్లి
X
యాక్టర్ - హీరో - డైరెక్టర్.. ఇలా చాలానే విభాగాల్లో చాలా అనుభవం ఉన్న జేడీ చక్రవర్తి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. 1989లో వచ్చిన రామ్ గోపాల్ వర్మ మూవీ శివతో అరంగేట్రం చేసిన చక్రవర్తి.. ఎట్టకేలకు పెళ్లికి ఒప్పుకున్నాడు. అదికూడా వాళ్లమ్మ బలంవంతం చేయడంతోనే అని తెలుస్తోంది.

ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని జేడీ పెళ్లి చేసుకోనున్నాడు. మరికొన్ని నెలల్లో ఈ పెళ్లి జరగనుంది. గెడ్డం చక్రవర్తి అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ యాక్టర్.. వాళ్ల అమ్మపై ఉన్న గౌరవంతోనే పెళ్లికి ఒప్పుకున్నాడట. 'నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత - మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నా' అంటున్నాడు జేడీ చక్రవర్తి.

ఈ నటుడికి తెలుగులోనే కాదు, హిందీలో కూడా మంచి గుర్తింపు ఉంది. సత్య మూవీతో బాలీవుడ్ లో అరంగేట్రంలోనే సక్సెస్ సాధించిన క్రెడిట్ కూడా ఉంది. కొన్ని హిందీ - తెలుగు సినిమాలకు డైరెక్షన్ కూడా చేశాడు జేడీ. ప్రస్తుతం ఈ యాక్టర్ ఏజ్ 46 ఏళ్లు. తన బర్త్ డే అయిన ఏప్రిల్ 16నే పెళ్లి నిర్ణయం తీసుకోవడం విశేషమే.