Begin typing your search above and press return to search.
RX100 హీరోకి నటించడం రాదు!!
By: Tupaki Desk | 1 Jun 2019 4:15 AM GMTRX100 సినిమా గురించి యూత్ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుకున్నారు? ఆ సినిమాలో లెక్కకు మిక్కిలి లిప్ లాక్ లు.. వేడెక్కించే రొమాంటిక్ సీన్స్ యువతరాన్ని టచ్ చేసాయి కాబట్టే. మరోసారి కార్తికేయ సినిమాలో అలాంటి లిప్ లాక్ లు .. రొమాన్స్ చూడబోతున్నామా? అంటే అవుననే `హిప్పీ` తాజా విజువల్స్ చెబుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ లోనూ వేడెక్కించే లిప్ లాక్ లు ఉన్నాయి. ఇకపోతే నేడు హైదరాబాద్ లో జరుగుతున్న హిప్పీ ప్రీరిలీజ్ వేడుకలో ఈ సినిమా బిట్ సాంగ్స్ ని ప్రదర్శించారు. ప్రతి వీడియోలో కార్తికేయ ప్రామిస్సింగ్ గా కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్.. షార్ట్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించడమే కాదు.. బాక్సర్ గా రఫ్ అండ్ ఠఫ్ లుక్ తో మైమరిపించబోతున్నాడని అర్థమవుతోంది.
హిప్పీ ప్రీరిలీజ్ వేడుకలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ కార్తికేయకు కెమెరా ముందే కానీ కెమెరా వెనక నటించడం అస్సలు రానేరాదని అన్నారు. అలాగే ఈ సినిమా దర్శకుడు కృష్ణ పర్ఫెక్షనిస్ట్ అని ప్రతి సన్నివేశంలో బ్యాక్ డ్రాప్ ఆర్టిస్టుల్లో సైతం పర్ఫెక్షన్ కావాలని అడిగేవాడని జేడీ తెలిపారు. కార్తికేయ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు.
జేడీ తరహాలోనే విక్రమ్.కె.కుమార్ వేదికపై మాట్లాడుతూ .. కార్తికేయ చక్కని నటుడు అని అయితే కెమెరా ముందే కానీ కెమెరా వెనక నటించే తత్వం అతడిది కాదని పొగిడేశారు. మొత్తానికి నవతరం హీరో తన దర్శకనిర్మాతలతో పాటు .. సాటి నటీనటులతోనూ మంచి హీరో అనిపించుకుంటున్నాడు. పెర్ఫామెన్స్ పరంగానూ అతడి లోని ఎనర్జీని అందరూ పొగిడేస్తుండడం ఆసక్తికరం. ఆర్.ఎక్స్ 100 సినిమాతో సక్సెస్ అందుకుని ఆ వెంటనే హిప్పీ చిత్రం సహా నాని- విక్రమ్.కె సినిమాకి కమిటయ్యాడు కార్తికేయ. వీటితో పాటు వరుసగా మూడు నాలుగు సినిమాలు అతడి క్యూలో ఉన్నాయి. హిప్పీ వేడుకలో ఠాగూర్ మధు- విక్రమ్.కె.కుమార్ సహా చిత్రయూనిట్ పాల్గొన్నారు.