Begin typing your search above and press return to search.
50లోనూ ఇంకా 20లోనే ఎలా జేడీ?
By: Tupaki Desk | 5 April 2019 1:30 AM GMTగడ్డం చక్రవర్తి అలియాస్ జేడీ చక్రవర్తి .. తెలుగు సినిమా హిస్టరీలో ఎప్పటికీ చెరిగిపోని పేరు ఇది. అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. ఆర్జీవీ ప్రియ శిష్యుడు. మేధోవర్గానికి చెందిన హీరో కం డైరక్టర్ అని పిలుపందుకున్నాడు. ఆర్జీవీ శిష్యరికంలో ఫిలింమేకర్ గా తనని తాను మలుచుకున్న జేడీ అప్పట్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అయితే దర్శకుడిగా ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు. ఆ క్రమంలోనే తెలుగు- తమిళంలో నటుడిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ముఖ్యంగా తెలుగులో కంటే తమిళంలో వరుసగా అవకాశాలు అందుకుంటూ అక్కడ బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం జేడీ ఓ ద్విభాషా చిత్రంలో నటించడం హాట్ టాపిక్. ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న హిప్పీ చిత్రంలో జేడీ ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నాడు. అతడి పాత్ర ఎంతో ఇంపార్టెంట్ అని దర్శకనిర్మాతలు ప్రశంసించారు. అంతేకాదు.. జేడీ మునుపెన్నడూ లేనంతగా ఈ చిత్రంలో కామెడీ చేస్తాడట. కార్తికేయ .. జేడీ ఒకరితో ఒకరు పోటీపడుతూ.. పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచుతారట. అయితే విలన్ వేషాల నుంచి మారి ఈ చిత్రంలో పాజిటివ్ రోల్ చేస్తున్నాడా? అంటే ఇప్పటికి సస్పెన్స్ అని చెబుతున్నాడు జేడీ.
అన్నట్టు ఆర్జీవీ ఫ్యాక్టరీలో పని చేసిన జేడీ 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ నేడు ప్రసాద్ లాబ్స్ లో అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. వయసు 50 కి దగ్గర (ఇప్పటికి 46) పడుతున్నా ఇప్పటికీ 30 ఏళ్ల నవమన్మధుడిలా కనిపిస్తున్నాడు జేడీ. ఇంతకీ మీ గ్లామర్ సీక్రెట్ ఏమిటి? అమృతం ఏదైనా తాగారా? అని ప్రశ్నిస్తే అందుకు జేడీ ఏమన్నారో తెలుసా? అదంతా నా మేకప్ మేన్ క్రియేటివిటీ. ఆయన్నే అడగండి! అంటూ ఎస్కేప్ అయిపోయాడు. అయితే జేడీలో పెళ్లి తర్వాత వచ్చిన మార్పు ఇదీ! అంటూ పాత్రికేయులు మాట్లాడుకున్నారు. కింగ్ నాగార్జున తర్వాత మళ్లీ ఆ రేంజులో మెయింటెయిన్ చేసే నాటి హీరోగా జేడీ కి ఐడెంటిటీ దక్కింది. అసలు గురూజీ ఆర్జీవీ ఫిలాసఫీని ఫాలో అయ్యే జేడీ పెళ్లాడతాడనే ఊహించలేదెవరూ. జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాడనుకున్న అతడు మనసు మార్చుకుని మూడేళ్ల క్రితమే కథానాయిక అనుక్రితిని పెళ్లాడాడు. పెళ్లి తర్వాత మనోడిలో గ్లామర్ పెరిగిందే కానీ తరగలేదంటూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ పరిసరాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లే దారిలో (టీవీ 5 ఆఫీస్ దగ్గర) 500 గజాల ఖరీదైన స్థలంలో జేడీ చక్రవర్తి ఇల్లు కట్టుకుని హాయిగా జీవించేస్తున్నాడు. అదీ సంగతి!