Begin typing your search above and press return to search.
జగన్ లో ఎంత మార్పో చెప్పిన జేడీ!
By: Tupaki Desk | 7 Jun 2019 7:39 AM GMTపరిచయం చేయాల్సిన అవసరం లేని నటుడు జేడీ చక్రవర్తి. వర్మ బ్యాచ్ కి చెందిన ఆయన్ను ప్రశ్న అడగటమే పాపం అన్నట్లుగా ఆయన సమాధానాలు ఉంటాయి. ప్రశ్న ఏదైనా నూటికి నూరుశాతం నిజాయితీతో చెప్పే అతి కొద్ది మంది నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు.
సమాధానం చెప్పటానికి ఎలాంటి భయం లేని ఆయన తాజాగా విడుదలైన హిప్పి మూవీ చేయటం తెలిసిందే. తాజాగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని ఆయన వెల్లడించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ మీద మీ అభిప్రాయం ఏమిటి? అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తనకు సంబంధించిన ఒక ఉదంతాన్ని చెప్పటం ద్వారా జగన్ లో వచ్చిన మార్పును ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. 2008లో తనకు యాక్సిడెంట్ అయ్యిందని.. ఆ సమయంలో నడవలేని పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి సమయంలో తాను ఫ్లైట్ జర్నీ చేయాల్సి వచ్చిందని.. తాను కూర్చున్న సీటు సౌకర్యవంతంగా లేకపోవటంతో సిబ్బందిని వీల్ ఛైర్ అడిగానని చెప్పారు. ఇదంతా జరిగినప్పుడు తన పక్క సీట్లో జగన్ ఉన్నారని.. అయినప్పటికీ ఆయన తనను చూసి కూడా పలుకరించలేదన్నారు.
జగన్ ప్రవర్తన చూసి షాక్ తిన్నానని.. అలాంటి జగన్ ను గత ఏడాది తాను ఎయిర్ పోర్ట్ లోనే మళ్లీ కలిసినట్లు చెప్పారు. అప్పుడు మాత్రం ఆయన.. తనకు తానే ఎలా ఉన్నారు? అని అడిగారని.. ఆయన ప్రవర్తన చూసి తాను షాక్ అయ్యానని చెప్పారు. గడిచిన ఇన్నేళ్లలో జగన్ లో మార్పు చాలా వచ్చిందని చెప్పారు జేడీ.