Begin typing your search above and press return to search.
శ్రీయని టార్గెట్ చేసిన డైరెక్టర్
By: Tupaki Desk | 14 Sep 2015 9:30 AM GMTఓ స్టార్ డైరెక్టర్ అందాల శ్రీయని టార్గెట్ చేశాడు. ఆవిడ వల్ల అట్టర్ ఫ్లాప్ ఎదురైందన్నట్టు మాట్లాడాడు. కాస్టింగ్ ఫెయిల్యూర్ ఏకంగా పుట్టి ముంచిందన్నట్టే వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. హిందీ చిత్ర సీమ యావత్తూ శ్రీయని పురుగును చూసినట్టే చూస్తోంది ఈ వ్యాఖ్యల వల్ల. డీప్ గా డీటెయిల్స్ లోకి వెళితే..
మలయాళ హిట్ చిత్రం తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో రీమేకైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు - తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన మీనా తెలుగులో కూడా నటించి మెప్పించింది. ఇద్దరు పిల్లల తల్లిగా మీనా నటన అసమానం అన్న పేరొచ్చింది. అయితే కమల్ హాసన్ హీరోగా తమిళ వెర్షన్ లో మాత్రం గౌతమి నటించింది. అక్కడ గౌతమి రీఎంట్రీ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్టొచ్చింది. ఆ తర్వాత హిందీ దృశ్యం రిలీజై అట్టర్ ఫ్లాపైంది. డబ్బులొచ్చినా కూడా క్రిటికల్ అప్లాజ్ మాత్రం రాలేదు. అక్కడ అజయ్ దేవగన్ సరససన శ్రీయ కథానాయికగా నటించింది. ప్రస్తుతం హిందీ దృశ్యం శ్రీయ వల్లే ఫ్లాపైందా? అన్న టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి నిశి కాంత్ కామత్ దర్శకత్వం వహించారు.
నింద దర్శకుడిపై వేయకుండా ఇప్పుడు కాస్టింగుపై వేస్తున్నారు జీతూ జోసెఫ్. మలయాళ వెర్షన్(మాతృక)కి దర్శకత్వం వహించిన జీతూ అన్ని భాషల చిత్రాల్ని విశ్లేషిస్తూ .. కాస్టింగ్ ఫెయిల్యూర్ వల్లే హిందీ దృశ్యం ఫెయిలైంది. అక్కడ శ్రీయని తీసుకోకూడదు అని వ్యాఖ్యానించాడు. పాపం శ్రీయ ఏం పాపం చేసిందని ? ఇలా టార్గెట్ చేశాడీ డైరెక్టర్. శ్రీయ వల్లే ఫ్లాపైంది.. అంటే మీరైతే ఒప్పుకుంటారా?