Begin typing your search above and press return to search.

మీనా నా మాట విని ఉంటే బాగుండేదిః జీతూ జోసెఫ్‌

By:  Tupaki Desk   |   2 March 2021 5:30 AM GMT
మీనా నా మాట విని ఉంటే బాగుండేదిః జీతూ జోసెఫ్‌
X
మలయాళంలో దాదాపు ఆరు ఏళ్ల క్రితం వచ్చిన దృశ్యం కు తాజాగా సీక్వెల్‌ వచ్చింది. జీతూ జోసెఫ్‌ సీక్వెల్‌ కు కూడా దర్శకత్వం వహించాడు. ఇక మోహన్‌ లాల్ మరియు మీనాలు వారి వారి పాత్రల్లో కంటిన్యూ అయ్యారు. మొదటి పార్ట్‌ లో కనిపించిన వారే కీలక పాత్రల్లో కొనసాగారు. మొదటి పార్ట్‌ కంటే మరింత బాగుంది అంటూ దృశ్యం 2 పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అద్బుతమైన కథ మరియు స్క్రీన్‌ ప్లే అంటూనే ఒక్క విషయంలో మాత్రం దర్శకుడు జీతూ జోసెఫ్‌ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్‌. అన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకున్న జీతూ సోసెఫ్‌ ఎందుకు మీనా లుక్ విషయమై జాగ్రత్త వహించలేదు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

ఏ సన్నివేశంలో అయినా మీనా ఓవర్ మేకప్ అండ్‌ లిఫ్‌ స్టిక్ తో కనిపించింది. ఎమోషనల్‌ సీన్స్‌ ఇంకా సెంటిమెంట్ సీన్స్‌ అనే తేడా లేకుండా మీనా మేకప్‌ లోనే ఉండటం అది కూడా డార్క్‌ లిఫ్‌ స్టిక్ పెట్టుకోవడం చూపించారు. ఒక సాదారణ మద్యతరగతి గృహిణి అంతగా మేకప్‌ అవ్వడం సహజత్వంకు దూరంగా ఉంది అంటూ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. నెటిజన్స్ కామెంట్స్ పై దర్శకుడు జీతూ జోసెఫ్‌ స్పందించాడు. మీనా మేకప్ విషయమై ఆమెతో మాట్లాడాను. మేకప్‌ లేకుండా మీరు ఈ సినిమాలో నటించాలంటూ కోరాను. కాని ఆమె అందుకు అంగీకరించలేదు. మేకప్‌ లేకుండా నటించలేను అంటూ తేల్చి చెప్పారు.

సినిమా లో నటించే సమయంలో వారికి కన్వినెంట్ గా ఉండాలి. లేక పోతే వారు నటించే విషయంలో ప్రభావం పడుతుంది. అందుకే మీనా గారిని మేకప్ విషయమై మళ్లీ ఒత్తిడి చేసే ప్రయత్నం చేయలేదు అన్నాడు. ఈనెల నుండి తెలుగు దృశ్యం 2 పట్టాలెక్కబోతుంది. ఇందులో కూడా మీనా నే కంటిన్యూ అవ్వబోతుంది. మరి తెలుగు దృశ్యం 2 లో అయినా మీనా మేకప్‌ విమర్శలు తప్పించుకుంటుందా చూడాలి. ‌