Begin typing your search above and press return to search.

ఆ హీరో ఇంకో హీరోను నిజంగానే కొట్టేశాడు

By:  Tupaki Desk   |   2 Feb 2016 9:30 AM GMT
ఆ హీరో ఇంకో హీరోను నిజంగానే కొట్టేశాడు
X
యాక్షన్ సన్నివేశాలు బాగా పండించాలనే ఉద్దేశంతో హీరోలు కొంచెం ఆవేశ పడిపోయి ఫైటర్లను నిజంగానే కొట్టేయడం కొన్నిసార్లు జరుగుతుంటుంది. ఐతే ఏదో ఆవేశంలో పొరబాటుగా అలా చేసేస్తే పర్లేదు కానీ.. అవతలి వ్యక్తి మీద నిజంగానే కోపంతో కొట్టేస్తే గొడవలైపోతాయి. తమిళ సినిమా ‘పోకిరి రాజా’ షూటింగ్ సందర్భంగా ఇదే జరిగింది. హీరో జీవా.. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మరో హీరో శిబిరాజ్ ను షూటింగ్ లో భాగంగా నిజంగానే కొట్టేశారు. సత్యరాజ్ తనయుడైన శిబిరాజ్ తో జీవాకు ఇంతకుముందు మంచి స్నేహమే ఉండేది.

ఐతే ‘పోకిరి రాజా’ షూటింగ్ సందర్భంగా ఇద్దరికీ చెడిందట. కొన్నిసార్లు ఇద్దరికీ మాటా మాట కూడా అయ్యిందట. అయినా ఇగోస్ పక్కనబెట్టి సినిమా ముఖ్యమని చెప్పి షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఐతే ఓ సన్నివేశంలో భాగంగా జీవా.. శిబిరాజ్ ను కొట్టాల్సి వచ్చిందట. ముందు మామూలుగా ట్రై చేశాడట. కానీ దర్శకుడు ఇంకో టేక్ చెప్పి, మరింత ఇన్వాల్వ్ అయి నటించాలని చెప్పాడట. ఆ సమయంలో శిబిరాజ్ మీద ఉన్న కోపాన్నంతా చూపించి నిజంగానే కొట్టేశాడట జీవా. దీంతో శిబిరాజ్ పెద్ద గొడవ చేసి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయాడట. షూటింగ్ ఆగిపోయిందట. మరి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుని షూటింగ్ కొనసాగిస్తారో చూడాలి.