Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పిన జీవిత
By: Tupaki Desk | 7 Oct 2021 3:30 PM GMTMAA ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రకాష్ రాజ్ - విష్ణు మంచు ప్యానెల్ ల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో భాగమైన జీవిత రాజశేఖర్ ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తేవడం తెలిసిందే. MAA లో ఈ వివాదాలన్నింటినీ చూసిన తర్వాత ఓటు వేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపలేదని చెప్పారు. ఇటీవల తారక్ ని కలిశాను. నాకు ఓటేయాల్సిందిగా కోరాను. కానీ అతడు ఆసక్తిగా లేనని అన్నారు. అసోసియేషన్ లో జరుగుతున్న వివాదాల గురించి ఆయన చర్చించారు. ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆయన నిరాసక్తత వ్యక్తం చేసారు అని మీడియా సమావేశంలో జీవిత అన్నారు.
ఓటు వేయనన్న ఎన్టీఆర్ పద్ధతి సరికాదు అంటూ మీడియాలో అనేక చర్చలు జరిగాయి. మరో వైపు మంచు విష్ణు.. ఎన్టీఆర్ తనకు ఓటు వేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఓటు వేయననడం సరికాదని తాను బుజ్జగిస్తానని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇదంతా పెద్ద రచ్చయ్యింది. చివరకు జీవిత తన మాటలను వెనక్కి తీసుకుని ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పింది. ఎన్టీఆర్ గురించి ఆమె చేసిన ప్రకటన తప్పుదోవ పట్టిస్తుందని ఆమె అంగీకరించింది.
ఓ ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ-``ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అతను నాతో మామూలుగా మాట్లాడుతూ అలా చెప్పాడు. నేను దానిని ఎత్తి చూపాల్సింది కాదు. ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది.. `` అంటూ పశ్చాత్తాపం చెందారు. `మా` లో జరుగుతున్న రచ్చలన్నింటినీ చూసిన తర్వాత తనకు బాధగా ఉందని అతను చెప్పాడు. నేను అతనిని ఓటు వేయమని అభ్యర్థించినప్పుడు అతను ఏమీ చెప్పలేనని అతను చెప్పాడు అని జీవిత అన్నారు. అయితే తాజా చాటింగ్ లో ప్రకాష్ రాజ్ కూడా తనకు తారక్ ఓటు వేస్తారని అన్నారు.