Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లాంటోడితో అలాంటి డైలాగా?

By:  Tupaki Desk   |   26 Dec 2016 5:30 PM GMT
ఎన్టీఆర్ లాంటోడితో అలాంటి డైలాగా?
X
ప్రస్తుత సినిమాల పోకడలపై ఆవేదన వ్యక్తం చేసింది సీనియర్ నటి జీవిత. ఒకప్పుడు హీరోయిన్లను పద్ధతిగా చూపించేవాళ్లని.. వ్యాంప్ పాత్రధారులనే కొంచెం అసభ్యంగా చూపించేవాళ్లని.. కానీ ఇప్పుడు లీడ్ హీరోయిన్లతోనే అన్నీ చేయించేస్తున్నారని ఆమె పేర్కొంది. ప్రస్తుత సినిమాల్లో డైలాగులు మరీ శ్రుతి మించిపోతున్నాయని ఆమె విమర్శించింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి గొప్ప హీరోతో ‘టెంపర్’ సినిమాలో చెప్పించిన డైలాగుల మీద ఆమె ఓ ఇంటర్వ్యూలో అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘‘ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్.. వ్యాంప్ పాత్రలు ఉండేవి. ఆ పాత్రల మధ్య తేడా చూపించేవారు. అచ్చమైన తెలుగు ఆడపడుచులా కనిపించే హీరోయిన్‌ వైపు అందరూ ఆకర్షితులయ్యేవారు. ఇప్పుడది లేదు. అన్నీ హీరోయిన్‌ తోనే చేయిస్తున్నారు. హీరోయిన్లు కూడా వ్యాంప్‌ క్యారెక్టర్లెందుకు.. అన్నీ మేమే చేస్తాం అన్నట్లు ఉంటున్నారు. పాత సినిమాల్లో ‘ఐ లవ్‌ యూ’ అని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి డైలాగ్ చెప్పించేవాళ్లు. కానీ ఇప్పుడది కామన్‌ వర్డ్‌ అయిపోయింది. ఒక సినిమాలో ‘మా కుక్కలు క్రాసింగ్‌ కి వచ్చాయి’ అని హీరోయిన్‌ అంటే.. ‘కుక్కలేనా.. ఇక్కడ మేం కూడా క్రాసింగ్‌ కి వచ్చాం’ అంటాడు హీరో. ఒక గొప్ప హీరోతో అలాంటి డైలాగ్ చెప్పిస్తారా?’’ అని జీవిత ప్రశ్నించింది. ప్రస్తుతం దేవుడే దిగివచ్చి చెప్పినా వినని యువతరం.. సినిమాల్లో హీరో చెప్పిందే వేదంగా భావించి ఫాలో అవుతున్నారని.. సినిమాలకు ఇంత క్రేజ్‌ ఉన్నప్పుడు ఆ సినిమాల ద్వారానే యువతకు మంచి విషయాలు చెప్పాలని.. సినిమాలు మరీ దిగజార్చి తీయాల్సిన పనిలేదని.. ప్రస్తుత సినిమాల ధోరణి మారాలని జీవిత అభిప్రాయపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/