Begin typing your search above and press return to search.
రాజశేఖర్ తండ్రి అంత్యక్రియలు విషయమై జీవిత ప్రెస్ నోట్
By: Tupaki Desk | 5 Nov 2021 9:15 AM GMTప్రముఖ హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. 94 ఏళ్ల వరదరాజన్ గోపాల్ గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయనకు న్యూరో సెంటర్ హైదరాబాద్ లో చికిత్స చేయిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు ఉదయం మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.. కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని దృవీకరించారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ స్వస్థలం తమిళనాడు చెన్నై. రిటైర్డ్ డీసీపీ చెన్నై అయిన వరదరాజన్ అంత్య క్రియలను ఎక్కడ నిర్వహిస్తారు.... ఆయన కు తుది నివాళి అర్పించేందుకు ఎటు వెళ్లాలి అనే విషయమై ఉన్న సందిగ్దం కు జీవిత ప్రెస్ నోట్ ను విడుదల చేసి సమాధానం ఇచ్చారు.
ఆమె ప్రెస్ నోట్ లో మామ గారు అయిన వరదరాజన్ గోపాల్ గారి అంత్య క్రియలను నిర్వహించేందుకు మొదటగా చెన్నైలోని అన్నా నగర్ లోని సొంత నివాసంకు తీసుకు వెళ్తున్నాం. అక్కడ అంత్య క్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. నేడు సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నా నగర్ కు వరదరాజన్ గోపాల్ మృత దేహంను చేర్చబోతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. అందుకోసం ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఆమె పేర్కొంది. కుటుంబం తో సహా అంతా కూడా ఇప్పటికే చెన్నై బయలుజేరారు.
రాజశేఖర్ కుటుంబ సభ్యులు మరియు బంధువులు అంతా కూడా చెన్నైలోని అన్నా నగర్ కు చేరుకుంటున్నారు. నేడు సాయంత్రంకు కొందరు సినీ ప్రముఖులు కూడా చెన్నై వెళ్తరనే సమాచారం అందుతోంది. బంధు మిత్రులు మరియు రాజశేఖర్ అభిమానులు మరియు శ్రేయోభిలాషులు అంతా కూడా ఎవరైతే వరదరాజన్ గోపాల్ మృతదేహంకు తుది నివాళి అర్పించాలనుకుంటారో వారు నేటి సాయంత్రం నుండి అన్నా నగర్ కు రావాల్సిందిగా జీవిత ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. శనివారం మద్యాహ్నం 12 గంటల వరకు తుది కార్యక్రమాలు పూర్తి చేసి అంత్య క్రియలను నిర్వహించబోతున్నట్లుగా కూడా ఆమె పేర్కొన్నారు. తండ్రి మృతితో శోఖం లో ఉన్న రాజశేఖర్ ను పలువురు సినీ ప్రముఖులు మరియు సన్నిహితులు పరామర్శించారు.. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపంను తెలియజేశారు.