Begin typing your search above and press return to search.
నరేష్ తవ్విన గుంతలో మోహన్ బాబు ఫ్యామిలీ!-జీవిత
By: Tupaki Desk | 8 Oct 2021 4:30 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఇంకా ఒకరోజు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. అక్టోబర్ 10న పోలింగ్ కి ఏర్పాట్లు సాగుతున్నాయి. దాదాపు 950 మంది సభ్యులున్న అసోసియేషన్ కి ఇంత హడావుడి ఏమిటా? అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. జనరల్ ఎలక్షన్ సందడి కనిపిస్తోంది. పోటీదారులంతా ఒకరినొకరు తిట్టుకుంటూ రాళ్లు రువ్వుకుంటూ బోలెడంత హడావుడి చేస్తున్నారు. మేమంతా ఒకటే అంటూనే కారాలు మిరియాలు నూరుతున్నారు.
తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని సమర్థిస్తూ జీవిత రాజశేఖర్ మోహన్ బాబు ఫ్యామిలీని టార్గెట్ చేసిన వైనం చర్చకు వచ్చింది. ``నరేశ్ తవ్విన గుంతలో మోహన్ బాబు కుటుంబం పడిపోయింది`` అని జీవితారాజశేఖర్ అన్నారు. జీవిత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఆమె జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
``మోహన్‌బాబు కుటుంబాన్ని చూస్తుంటే జాలేస్తోంది. నరేశ్ తవ్విన గుంతలో ఆ ఫ్యామిలీ పడిపోయింది`` అని జీవిత అన్నారు. `మా` విషయంలో నరేశ్ స్వార్థంతో పనిచేశారు. ప్రకాష్ రాజ్ నిజాయతీగా పనిచేస్తారని అన్నారు. సేవ చేసేందుకు మాత్రమే తాను పోటీకి దిగుతున్నానని జీవిత తెలిపారు. ప్రలోభాలకు లొంగి ఓట్లు వేయొద్దని అన్నారు. 60 పైబడిన వాళ్లు ఓటేసేందుకు వచ్చేందుకు వెనకాడుతున్నారని కూడా జీవిత వెల్లడించారు.