Begin typing your search above and press return to search.
'రాజశేఖర్ - జీవితలు మమ్మల్ని మోసం చేశారు.. త్వరలోనే జైలుకు వెళ్తారు'
By: Tupaki Desk | 22 April 2022 2:04 PM GMTటాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ మరియు ఆయన భార్య జీవితలు మోసం చేశారని 'PSV గరుడవేగ' నిర్మాత ఆరోపించారు. ఈ మేరకు వారిపై జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు మరియు మేనేజింగ్ డైరెక్టర్ హేమ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. సినిమా నిర్మాణానికి రాజశేఖర్ - జీవిత ఆస్తులు తాకట్టుపెట్టి తమ దగ్గర నుంచి రూ.26 కోట్లు తీసుకున్నారని.. కానీ ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని అన్నారు.
'గరుడవేగ' సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రాజశేఖర్ తమ వద్దకు వచ్చి ఎమోషనల్ అయ్యారని.. రాజశేఖర్ వాళ్ల నాన్న వరదరాజన్ కోరిక మేరకు ఆస్తులు తాకట్టుపెట్టుకుని డబ్బులు ఇచ్చామని తెలిపారు. ప్రాపర్టీ తమ వద్ద పెట్టి ఆ ఆస్తులను బినామీల పేరుతో మార్చుకుని మోసం చేశారని.. రాజశేఖర్ - జీవితల వల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.
''రాజశేఖర్ పై తమిళనాడు, తిరువళ్ళూరు జిల్లా ఎస్పీ క్రిమినల్ కేసు నమోదు చేశారు. సినిమాకు మేము డబ్బు పెడితే సంజయ్ రామ్ కు సినిమాను అమ్మేశాడు. త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్తాడు. జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషి. అవకాశం కోసం భార్యాభర్తలు మమ్మల్ని వాడుకున్నారు. తమను మోసం చేశారనడానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి''
''నగరి కోర్టులో వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో జీవితా రాజశేఖర్ పై నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇద్దరూ చాలా మంచి మనుషులుగా బయటి ప్రపంచంలో చలామణి అవుతున్నారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ వల్ల మేము వారికి పరిచయం అయ్యాం. ఇప్పుడు రాజశేఖర్ - జీవితల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం'' అని జ్యో స్టార్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఈ చిత్రాన్ని జీవితా - రాజశేఖర్ ఫ్యామిలీ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే తమకు చెల్లించాల్సిన మొత్తం జీవితా రాజశేఖర్ దంపతులు చెల్లించలేదని.. తమని మోసం చచేసారని మేకర్స్ ఆరోపిస్తున్నారు. మరి దీనిపై జీవిత - రాజశేఖర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.