Begin typing your search above and press return to search.

'మా' మీటింగ్‌ వివాదంపై జీవిత ఏమన్నారంటే

By:  Tupaki Desk   |   22 Oct 2019 5:26 AM GMT
మా మీటింగ్‌ వివాదంపై జీవిత ఏమన్నారంటే
X
అధ్యక్షుడు లేకుండా 'మా' మీటింగ్‌ పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రెండుగా చీలిపోయిన మా సభ్యుల్లో కొందరు సమావేశం నిర్వహించిన జీవిత రాజశేఖర్‌ లపై విమర్శలు చేస్తున్నారు. ఆదివారం జరిగిన సమావేశం జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని స్నేహ పూర్వక వాతావరణం జరిగిన మీటింగ్‌ అంటూ కొందరు సభ్యులు చెబుతున్నారు. ఈ విషయమై మా అధ్యక్షుడు చాలా సీరియస్‌ గా ఉన్నారు. ఆదివారం నిర్వహించిన మా సమావేశం గురించి వస్తున్న విమర్శలు.. వివాదాలకు చెక్‌ పెట్టేందుకు మా జనరల్‌ సెక్రటరీ జీవితా స్పందించారు.

ఆమె మాట్లాడుతూ.. నిన్న జరిగిన సమావేశం కేవలం ఆత్మీయ సమావేశం.. ఒక సాదారణ మా సమావేశంగా అనుకోవచ్చు. మేము ఆహ్వానించగానే ఈ సమావేశానికి 200 మంది వచ్చారు. వారందరికి కూడా కృతజ్ఞతలు. మేము నిర్వహించింది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదు. అంతరంగికంగా జరిగిన మా సమావేశంలో పలు విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. పలువురు సభ్యులు సమస్యలకు సంబంధించి మాట్లాడారు. అయితే సమస్యల పరిష్కారంకు ఎక్స్‌ ట్రార్డినరీ జనరల్‌ బాడీ మీటింగ్‌ జరగాల్సి ఉంది. అందుకు 20 శాతం మంది మా సభ్యులు అంగీకారం చెబితే ఆ మీటింగ్‌ నిర్వహించవచ్చు.

జనరల్‌ బాడీ మీటింగ్‌ కోరుకునే వారు ఆఫీస్‌ కు వచ్చి సంతకం చేసి తమ అంగీకారంను తెలుపవచ్చు. లేదంటే లెటర్‌ లేదా మెయిల్‌ ద్వారా కూడా మీ అంగీకారంను తెలియజేయవచ్చు అంటూ జీవిత అన్నారు. 20 శాతం మంది సభ్యుల అంగీకారం తెలిపిన 21 రోజుల్లో తప్పకుండా మీటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 20 శాతం మంది సభ్యులు జనరల్‌ బాడీ సమావేశంకు ఒప్పుకుంటే అప్పుడు సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారంకు సంబంధించిన విషయాలపై చర్చ జరుపుతామంటూ తెలియజేశారు.

ఆదివారం జరిపిన సమావేశం కేవలం ఎలాంటి సమస్యల పరిష్కారానికి సంబంధించిన జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని.. రూల్స్‌ కు విరుద్దంగా తాము వెళ్లడం లేదని జీవిత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందా అంటూ మా సభ్యుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ వివాదంకు పెద్దలు స్పందించి ఒక ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని మా సభ్యులు కోరుకుంటున్నారు.