Begin typing your search above and press return to search.
మేమేమైనా మీ ఇంట్లో కట్టేసే కుక్కలమా?
By: Tupaki Desk | 2 Jan 2020 12:36 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో లుకలుకలు మా డైరీ ఆవిష్కరణ వేదకగా మరోసారి బయటపడిన సంగతి తెలిసిందే. ఓవైపు పెద్దలు వారిస్తున్నా ఈ వేదిక రసాబాస అయ్యింది. ఈ వేదికపై హీరో రాజశేఖర్ ఎమోషనల్ స్పీచ్.. మా అంతర్గత కలహాల ప్రస్థావన సీనియర్ల సహనానికి పరీక్ష పెట్టింది. దాంతో బహిరంగంగానే చిరు-మోహన్ బాబు వంటి వారు క్రమశిక్షణ చర్యలు కోరారు.
అయితే జరిగిన తప్పునకు జీవిత రాజశేఖర్ అదే వేదికపై క్షమించమని కోరారు. రాజశేఖర్ చేసిన దానికి తమను క్షమించాల్సిందిగా కోరారు. చిరంజీవి తమ కోసం చాలా సమయం కేటాయించారని.. మా అభివృద్ధికి ఎన్నో సలహాలిచ్చారని.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని జీవిత వ్యాఖ్యానించారు.
తాము దేవుళ్లం కాదని.. తాము కూడా మీలాంటి మనుషులమేనని.. గొడవలు ప్రతిచోటా సహమే కదా! అని అన్నారు. రాజశేఖర్ ఏదీ దాచుకోరు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గొడవలు.. తగాదాలు ఇలాంటి వాటిలో సహజమేనని అనడమే గాక.. మా అంతర్గత లుకలుకలు అందరికీ తెలిసినవేనని అన్నారు.
ఇదే వేదికపై తమపై వ్యక్తిగత దూషణలు చేసేవారికి జీవిత కౌంటర్ వేసారు.. తమ వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్ చేయడానికి ఎవరికీ అర్హత లేదని.. తామేమీ మీ ఇంట్లో ఇంట్లో కట్టేసే కుక్కలమో.. గేదెలమో కాదని జీవితా రాజశేఖర్ ఫైర్ అయ్యారు. మాలో అంతర్గత సమస్యలపై చర్చించుకుంటామని అన్నారు.