Begin typing your search above and press return to search.

బన్నీ నంది అవార్డుకు కొత్త భాష్యం

By:  Tupaki Desk   |   18 Nov 2017 7:05 AM GMT
బన్నీ నంది అవార్డుకు కొత్త భాష్యం
X
‘రుద్రమదేవి’ సినిమాకు నంది అవార్డుల విషయంలో జరిగిన అన్యాయం గురించి ప్రస్తావిస్తూ.. నంది అవార్డుల కమిటీ అవగాహన రాహిత్యాన్ని కూడా బయటపెట్టాడు ఈ చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్. తాము అసలు అల్లు అర్జున్ పేరును ఒక అవార్డుకు ప్రతిపాదిస్తే.. కమిటీ ఇంక అవార్డుకు ఎంపిక చేసిందని గుణశేఖర్ అన్నాడు. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రకు గాను ‘సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌’ కేటగిరీలోనే అల్లు అర్జున్‌ పేరును నంది అవార్డులకు పంపానని.. కానీ జ్యూరీ సభ్యులు బన్నీకి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ కేటగిరిలో అవార్డిచ్చారని.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అంటే తక్కువ అని కాదని.. కానీ తాను అప్లై చేయని కేటగిరిలో ఎందుకు అవార్డు ఇచ్చారని గుణశేఖర్ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయమై నంది అవార్డుల కమిటీలో సభ్యురాలైన జీవిత చిత్రమైన వాదనతో మీడియా ముందుకొచ్చారు.

నంది అవార్డుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఇచ్చే పురస్కారం ఎస్వీ రంగారావు పేరిట ఉంటుందని.. అలాంటి మహానుభావుడి పేరిట నెలకొల్పిన అవార్డు కాబట్టి అది ఇస్తే గౌరవప్రదంగా ఉంటుందని తాము బన్నీకి ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్’ కింద పురస్కారం ఇచ్చామని ఆమె చెప్పడం విశేషం. ఒక కేటగిరి కింద అవార్డుకు దరఖాస్తు చేస్తే ఇంకో కేటగిరి కింద అవార్డు ఇవ్వడం కచ్చితంగా కమిటీ నిర్లక్ష్యానికి.. అవగాహన రాహిత్యానికి ఉదాహరణ. దీన్ని బట్టి కమిటీ ఎంత సీరియస్ గా పని చేసిందో అర్థమవుతోంది. కనీసం ఈ పొరబాటును అంగీకరించడమో.. సరైన వివరణ ఇచ్చుకోవడమో.. ఏదైనా మార్పు చేసే వీలుంటే చేయడమో చేయకుండా ఇలా కవరింగ్ మాటలు చెప్పడం ద్వారా కమిటీ విలువ మరింత తగ్గించేస్తున్నారనే చెప్పాలి.