Begin typing your search above and press return to search.
వారసురాలిని తీర్చిదిద్దే పనిలో సవాళ్లు
By: Tupaki Desk | 9 Sep 2019 1:30 AM GMTయాంగ్రీ యంగ్ మేన్ టు ప్యూర్ యాంగ్రీ మేన్ గా రూపాంతరం చెందారు హీరో రాజశేఖర్. దశాబ్ధాల కెరీర్ ని సాగించిన ఈ సీనియర్ నటుడు ఇప్పుడు ఎంతో పరిణతితో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్నారు. ఆయన హీరోగా కొనసాగుతున్న ఈ క్రమంలోనే ఇద్దరు కూతుళ్లు సినిమాల్లో లక్ చెక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పెద్దకూతురు శివాని ఎంట్రీ కి అంతా రెడీ అయినా కొన్ని కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడింది. బాలీవుడ్ హిట్ చిత్రం `టు స్టేట్స్` రీమేక్ తో శివానీని హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుని తడబడ్డారు.
ఇలాంటి కారణాలతో శివానీ కంటే ముందే చిన్న కూతురు శివాత్మిక `దొరసాని` చిత్రంతో ఎంట్రీ ఇచ్చేయడంతో పెద్ద కుమార్తె రేసులో వెనక్కి వెళ్లినట్టయ్యింది. అయితే ఆలస్యమైనా కానీ.. ప్రస్తుతం శివానీ ఎంట్రీకి పక్కగా ప్లాన్ ని రెడీ చేశారు. ఇటీవల సమంత నటించిన `ఓ బేబీ` సినిమాలో సమంతకు మనవడిగా నటించిన తేజ సరసన ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారన్నది తాజా అప్ డేట్. నరుడా డోనరుడా ఫేమ్ రామ్ మల్లిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. హీరో తేజకు మంచి స్నేహితుడైన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తూ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారట. అందాల రాక్షసి - అర్జున్ రెడ్డి ఫేమ్ రథన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని శేఖర్ అనే నూతన నిర్మాత నిర్మించబోతున్నారు.
శివానీ తొలి ప్రయత్నం కారణాంతరాల వల్ల వెనక్కి వెళ్లింది కానీ తాను మాత్రం ఫెయిల్ కాలేదు. తనని తాను నిరూపించుకునేందుకు చాలా స్కోప్ ఉంది. అయితే నవతరం నాయికల వెల్లువలో తనని తాను ఉత్తమ నటిగా ఆవిష్కరించుకోవడమే పెద్ద సవాల్. అందుకు సీనియర్ నటి అయిన జీవిత రాజశేఖర్ సలహాలు శివానీకి అక్కరకొస్తాయనడంలో సందేహం లేదు. శివానీ-శివాత్మికల కెరీర్ కి జీవిత విలువైన సలహాలు సూచనలు పెద్ద అండ గా నిలుస్తాయి. ఇటు మూవీ ఆర్టిస్టుల సంఘం(మా)లో మామ్ కీలక పదవిలో బలమైన పాత్ర పోషిస్తున్నారు. అది కూడా కూతుళ్ల కెరీర్ కి సాయం అవుతుందనడంలో ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. దక్షిణాది నాలుగు సినీపరిశ్రమలకు కొత్త కథానాయికలు కావాలి. అలాంటప్పుడు నిరూపించుకోలేకపోతే అది మన తప్పే.