Begin typing your search above and press return to search.
నరేశ్ తో విభేదాల్లేవని తేల్చేసి..సారీ చెప్పిన జీవిత
By: Tupaki Desk | 2 Jan 2020 12:01 PM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ విడుదల సందర్భంగా హీరో రాజశేఖర్ అసహనం.. తొందరపాటు సంచలనంగా మారటమే కాదు.. పెద్ద రచ్చగా మారింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి మాట్లాడుతున్న వేళ అడ్డుపడటం ఒక ఎత్తు అయితే.. పరుచూరి మాట్లాడుతుంటే మైకు లాగేసుకున్న వైనం పెను దుమారంగా మారింది.
రాజశేఖర్ తీరుపై చిరంజీవితో పాటు.. మోహన్ బాబు సైతం తప్పు పట్టారు. ఇక.. మా అధ్యక్షుడు నరేశ్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పరిధి దాటిన వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే కమిటీకి చెప్పాలే తప్పించి బహిరంగంగా మాట్లాడితే ఊరుకోమన్నారు.
వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలతో రాజశేఖర్ సతీమణి జీవిత కల్పించుకున్నారు. రంగంలోకి దిగిన ఆమె.. రాజశేఖర్ ది చిన్నపిల్లాడి తత్త్వమని చెప్పిన ఆమె.. ఇలాంటి కార్యక్రమంలో రాజశేఖర్ అలా మాట్లాడినందుకు క్షమించాలని తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు.
విభేదాలున్నా సరే డైరీ విడుదల కార్యక్రమాన్ని అందరూ కలిసి చేయాలని మెగాస్టార్ చెప్పారని.. తమకు.. నరేశ్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇక.. ముందు కూడా కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పటం ద్వారా.. రాజశేఖర్ చేసిన డ్యామేజ్ ను అంతో ఇంతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు జీవిత. మరి.. ఆమె చెప్పిన సారీని ‘‘మా’’ పెద్దలు పరిగణలోకి తీసుకుంటారా? అన్నది క్వశ్చన్ గా మారింది.