Begin typing your search above and press return to search.
నాలాంటి వాళ్లను కూడా లాగారు!!- జీవిత
By: Tupaki Desk | 5 March 2019 1:22 PM GMTఆర్టిస్టులకు జరిగే అన్యాయంపై మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించారు జీవిత రాజశేఖర్. అన్యాయం జరిగితే ఎదురు ప్రశ్నించే సన్నివేశమే మా అసోసియేషన్ లో లేదని వ్యాఖ్యానించడం వేడెక్కిస్తోంది. గత ఏడాది శ్రీరెడ్డి అంశంలో మా సరిగా స్పందించలేదని జీవిత ఓ మీడియా ముఖంగా వ్యాఖ్యానించడం సంచలనమైంది. అంతేకాదు తనకు అన్యాయం జరిగినా పట్టించుకోలేదని తనకు తానుగానే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని జీవిత వ్యాఖ్యానించారు.
రెండు టెర్ములుగా `మా` పాలన ఎలా ఉన్నా అందరం వదిలేసాం. ఏదైనా విషయం వచ్చినప్పుడు చిరంజీవి గారు పట్టించుకుంటున్నా.. మిగతా టైమ్ లో ఎవరూ పట్టించుకోవడం లేదు. శ్రీరెడ్డి అట్రాసిటీ వంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ పై సరిగా ఎవరూ స్పందించలేదు.. పరిష్కరించలేదు.. అని వ్యాఖ్యానించారు. శ్రీరెడ్డి ఇన్సిడెంట్ తర్వాత నాలాంటి వాళ్లను కూడా లాగారు!! అంటూ జీవిత వ్యాఖ్యానించారు.
``నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నేనే ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎవరు పడితే వాళ్లు.. ఏదైనా సినిమావాళ్లు అన్నట్టు మాట్లాడేస్తున్నారు. వెదవా అని అంటే నవ్వేసి వెళ్లిపోతే అది అలాగే కొనసాగుతోంది. ఎదురెళితే తిరిగి అలా అనలేరు`` అని జీవిత రాజశేఖర్ వ్యాఖ్యానించారు. నెక్ట్స్ జనరేషన్ పిల్లలు ఉన్నారు. వీళ్లందరి పరిస్థితేంటి? ఇలా అయితే అందుకే మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని అన్నారు. అయితే ఆర్టిస్టులంతా యునైట్ అయ్యి ప్రతిదీ అడగాల్సి ఉంది... పరిశ్రమ విషయంలో ఆర్టిస్టుల విషయంలో కామెంట్లు చేస్తే ఎదురెళ్లాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు. ఇటీవలే ప్యానెల్ ప్రకటన వేళ హీరో రాజశేఖర్ ప్రస్తుత మా బృందం సరిగా పని చేయడం లేదని విమర్శించిన సంగతి తెలిసిందే.