Begin typing your search above and press return to search.
నరేశ్ పెట్టిన ప్రెస్ మీట్ కు ఎందుకు వెళ్లలేదో చెప్పిన జీవిత
By: Tupaki Desk | 27 Jun 2021 5:30 AM GMTమా’ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి హాట్ టాపిక్ గా మారిన ప్రకాశ్ రాజ్.. తాజాగా తన టీంతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. టీంలోని వారు మాట్లాడిన మాటలకు తగ్గట్లుగా.. తమ వాదనను వినిపించేందుకు నరేశ్.. జీవిత తదితరులు కలిసి ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా ప్రచారం జరిగింది. తొలుత ఫిలిం చాంబర్లో అనుకున్నా.. అనంతరం సూపర్ స్టార్ క్రిష్ణ ఇంట్లో మీడియా భేటీని నిర్వహించారు. అయితే.. ఈ భేటీకి అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించిన జీవిత హాజరు కాలేదు.
దీంతో.. అసలేం జరిగిందన్న కన్ఫ్యూజన్ తెర మీదకు వచ్చింది. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు జీవితా రాజశేఖర్. తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేయనున్నట్లు చెప్పిన ఆమె.. టీంతో కాకుండా సొంతంగా పోటీ చేస్తానని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక.. ప్రెస్ మీట్ కు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తాను రాకపోవటానికి కారణం తన నిర్ణయం కాదని..నరేశ్ ఇచ్చిన సలహాతోనే తాను హాజరు కాలేదని చెప్పారు.
ప్రెస్ మీట్ పెట్టి హాజరు కాకపోవటం వెనకున్న అసలు కారణాన్ని వివరిస్తూ.. ‘‘శుక్రవారం ‘మా’ అధ్యక్షుడు నరేష్‌గారు ఫోన్ చేసి అసోసియేషన్ చేపట్టిన కార్యక్రమాలపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామన్నారు. దానిని నేను మా గ్రూపులో పోస్ట్ చేశా. గ్రూపులో కొందరు సభ్యులు తాము కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వస్తామన్నారు. ఈ విషయాన్ని నరేష్‌గారికి చెప్పా. ఆయన ‘ప్రెస్ ముందు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం మంచిది కాదేమో... నేను వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా’నన్నారు. అందుకే నేను శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వెళ్లలేదు’’ అని సమాధానం ఇచ్చారు.