Begin typing your search above and press return to search.

ఆ ఆంటీనే ప్రపంచ అందమైన మహిళ అంట

By:  Tupaki Desk   |   21 April 2016 4:36 AM GMT
ఆ ఆంటీనే ప్రపంచ అందమైన మహిళ అంట
X
అందగత్తె అంటే మిసమిసలాడే యవ్వనంతో ఎగిసిపడే అందాల భామగా భావించటం కద్దు. ముప్ఫై ఏళ్లు టచ్ అయితే హీరోయిన్ అవకాశాలు ఇచ్చేందుకు టాలీవుడ్ లాంటి చోట ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఏకంగా యాభైఏళ్లకు దగ్గరగా వచ్చిన ఒక మగువను ప్రపంచంలోనే అందమైన మహిళగా ఎంపిక చేయటం మనకైతే ఆశ్చర్యమే.

కానీ.. అందానికి వయసు సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టంగా చేస్తూ.. ప్రఖ్యాత పీపుల్స్ మేగ్ జైన్ ఆసక్తికర ఎంపిక చేసింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ప్రఖ్యాత హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నలభై ఏళ్లు దాటితే హీరోయిన్ అమ్మ వేషం తప్పించి మరో పాత్ర ఇవ్వటానికి ఒప్పుకోని మన సినీ జీవుల లెక్కలో చూస్తే.. జెన్నిఫర్ ముదిరిపోయిన బెండకాయే. కానీ.. ముదురులోనూ నదురు చూసే ప్రాశ్చాత్య జీవుల అందం లెక్కలు వేరన్న విషయం తాజా ఎంపికతో మరోసారి స్పష్టమైందని చెప్పాలి. ప్రపంచంలోనే అందమైన మహిళ టైటిట్ ఆంటీకి కట్టబెట్టేశారని ఎంతమంది అమ్మాయిలు పీలైపోయి ఉంటారో..?