Begin typing your search above and press return to search.

ఈమె రెమ్యునరేషన్.. బ్లాక్ బాస్టర్!

By:  Tupaki Desk   |   24 Aug 2016 6:32 AM GMT
ఈమె రెమ్యునరేషన్.. బ్లాక్ బాస్టర్!
X
ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్స్ అందుకునే నటులు ఎవరై ఉంటారు? ఇండియాలో అయితే బాలీవుడ్ సూపర్ స్టార్స్ అనుకోవచ్చు, అప్పుడప్పుడూ రజనీకాంత్ పేరు కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ స్థాయిలో అయితే కచ్చితంగా హాలీవుడ్ నటులే అనుకుంటాం. అంతవరకూ కరెక్టే కానీ.. హాలీవుడ్ లో ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంటున్నారు అనే విషయాలపై తాజాగా ఒక నటీమణి పేరు వెలుగులోకి వచ్చింది. ఈమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి తెలిస్తే.. మైండ్ బ్లాక్ అయిపోద్ది అనడంలో సందేహం ఏమాత్రం లేదు.

తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన 2016లో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల జాబితాల్లో "హంగర్ గేమ్స్" స్టార్ జెన్నీఫర్ లారెన్స్ టాప్ ప్లేస్ లో నిలించింది. వరుసగా రెండో ఏడాది కూడా ఈమెనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈమె తర్వాతి స్థానంలో మెలిస్సా కార్టీ నిలిచినట్లు పోర్బ్స్ వెల్లడించింది. ఇంతకూ జెన్నీఫర్ లారెన్స్ తీసుకుంటున్న పారితోషకం ఎంతో చెప్పనే లేదు కదా... అక్షరాలా 46 మిలియన్ డాలర్లు అంటే.. మన ఇండియన్ కరెన్సీలో 308కోట్ల రూపాయలకు పైమాటే.

ప్రఖ్యాత అమెరికన్ రచయిత సుజానే కోలిన్స్ నవల ఆధారంగా తెరకెక్కిన "హంగర్ గేమ్స్" కువచ్చిన లాభాలతో ఈ నటి మళ్లీ టాప్ ప్లేస్ లో నిలిచినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అయితే.. ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నా కూడా ఈమెలో ఒక అసంతృప్తి ఉందట. ఎంత చేసినా కూడా హాలీవుడ్ రెమ్యునరేషన్స్ లో లింగ వివక్ష బాగా ఉందని, అందుకే హాలీవుడ్ నటులు తీసుకుంటున్న పారితోషికాలు కంటే నటీమణులు అందుకునే పారితోషికాలు తక్కువగానే ఉంటున్నాయని ఈమె చెబుతుంది. కాగా.. గతేడాదితో పోలిస్తే జెన్నిఫర్ ఆదాయాలు 2016లో 11.5 శాతం క్షీణించాయి. గతేడాది ఆమె పారితోషికం 52 మిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది 46 మిలియన్ డాలర్లుగా ఉంది. సినిమాలు, టీవీ, కాస్మోటిక్, ఇతర కంపెనీల నుంచి వచ్చే ఎండోర్స్ మెంట్స్ ఆదాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందిస్తూ ఉంటుదంట.