Begin typing your search above and press return to search.

మగాళ్లు వాడుకుని వదిలేస్తారంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   13 Nov 2015 1:00 PM IST
మగాళ్లు వాడుకుని వదిలేస్తారంటున్న హీరోయిన్
X
మగాళ్లను అస్సలు నమ్మడానికి వీల్లేదంటోంది ఆ హీరోయిన్. వాడుకుని వదిలేయడం మగాళ్లకు అలవాటే అని... వాళ్ల స్వార్థమే వాళ్లకు ముఖ్యమని ఆక్రోశం వెల్లగక్కుతోంది ఆ అందాల భామ. ఆమె మరెవరో కాదు.. తన హాట్ హాట్ అందాలతో ప్రపంచ వ్యాప్తంగా కుర్రకారుకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన హలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్. తరచుగా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చడం అలవాటుగా చేసుకున్న జెన్నిఫర్.. ఈ మధ్య క్రిస్ మార్టిన్ తో బ్రేకప్ చేసుకుంది. ఏడాది పాటు చెట్టాపట్టాలేసుకు తిరిగిన వీళ్లిద్దరూ ఈ మధ్యే విడిపోయారు. ఐతే బాయ్ ఫ్రెండ్స్ ని మార్చడంలో తన తప్పేమీ లేదని.. వాళ్లే తనను మోసం చేసి వెళ్లిపోతున్నారని జెన్నిఫర్ వాపోతోంది.

‘‘అబ్బాయిలు ఎప్పుడూ తమ స్వార్థమే చూసుకుంటారు. వాడుకుని వదిలేస్తుంటారు. బ్రేకప్ విషయంలో నా తప్పేమీ లేదు. అలాగని నేనెవర్నీ నిందించదలుచుకోలేదు. ఇప్పుడు ప్రతి వీకెండ్ లోనూ నేను ఒంటరిగానే ఉంటున్నా. బయటక రమ్మని నన్నెవరూ పిలవడం లేదు కూడా’’ అని జెన్నిఫర్ చెప్పింది. అబ్బాయిలు ముందు తన పట్ల చాలా ఆకర్షణతో కనిపిస్తారని.. కానీ కొన్ని రోజుల తర్వాత వారికి తనపై మోజు తీరిపోతుందని.. ఒంటరిగా వదిలేస్తారని, తాను చెప్పిన సమయానికి డేటింగ్ కు రాకుండా ఏవో కారణాలతో వ్యతిరేకిస్తుంటారని జెన్నిఫర్ ఆవేదన వ్యక్తం చేసింది. తన దృష్టిలో అబ్బాయిలంటే స్వార్థపరులు, వాడుకుని వదిలేసి రకం అని ఆమె ముక్తాయించింది.