Begin typing your search above and press return to search.

ఏమాయ చేశావే ఫార్ములాతో నాని ‘జెర్సీ’

By:  Tupaki Desk   |   21 Dec 2018 5:55 AM GMT
ఏమాయ చేశావే ఫార్ములాతో నాని ‘జెర్సీ’
X
రియల్‌ లైఫ్‌ లో అయినా, రీల్‌ లైఫ్‌ అయినా భార్య భర్తల్లో లేదా లవర్స్‌ లో అమ్మాయి కంటే అబ్బాయి పెద్ద వాడు అయ్యి ఉంటాడు. అప్పుడప్పుడు రియల్‌ లైఫ్‌ లో తన కంటే ఎక్కువ ఏజ్‌ అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాగే చాలా రేర్‌ గా సినిమాల్లో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం. తెలుగు లో ‘ఏమాయ చేశావే’ చిత్రం లో నాగచైతన్య కంటే సమంత ఎక్కువ ఏజ్‌. అయినా కూడా సమంతను వదిలి పెట్టకుండా నాగచైతన్య ప్రేమించి, ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు నాని చేస్తున్న ‘జెర్సీ’ మూవీ కూడా అదే ఫార్ములాతో తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

‘మళ్లీ రావా’ ఫేం గౌతమ్‌ దర్శకత్వంలో నాని, శ్రద్దా శ్రీనాథ్‌ జంటగా తెరకెక్కుతున్న ‘జెర్సీ’ మూవీ క్రికెట్‌ ప్రధానంగా సాగుతుందనే విషయం తెల్సిందే. నాని ఈ చిత్రంలో క్రికెటర్‌ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమా గురించి తాజాగా ఈ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరో పాత్ర హీరోయిన్‌ పాత్ర కంటే చిన్న వయస్సు వాడిగా ఉంటాడని, హీరోయిన్‌ కంటే 4 ఏళ్ల చిన్న వాడిగా హీరో ఈ చిత్రంలో కనిపిస్తాడని చెబుతున్నారు.

క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ చాలా విభిన్నంగా ఉంటుందని, దర్శకుడు గౌతమ్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాని గత చిత్రం ‘దేవదాస్‌’ నిరాశ పర్చడంతో ఆయన ఫ్యాన్స్‌ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.